ఎన్నికలు వచ్చాయంటే చాలు అన్ని రాజకీయ పార్టీలు వారి వారి సర్వేలు చేయించుకుంటూ ఉంటారు. ఆ సర్వేలను బట్టే వారు అభ్యర్థులకు టికెట్లు ఇవ్వడం  వంటివి చేస్తూ ఉంటారు. ఆ విధంగానే తెలంగాణలో కూడా సర్వేల ఆధారంగానే  కేసీఆర్ అసెంబ్లీ సెగ్మెంట్లలో అభ్యర్థులను కేటాయింపు చేశారు. చివరికి బొక్క బోర్లా పడి పోయారని చెప్పవచ్చు. తాజాగా  సీఎం కేసీఆర్  తెలంగాణలో 8 నుంచి 12 లోక్ సభ స్థానాల్లో  బీఆర్ఎస్ గెలవబోతోందని, అంతేకాకుండా ఏపీలో జగన్ మళ్ళీ విజయం సాధిస్తారని తనకు సమాచారం వచ్చిందని  ఆయన ఒక టీవీ ఛానల్ లో జోస్యం చెప్పారు. ఆయన మాటలకు సోషల్ మీడియాలో విపరీతంగా సెటైర్లు వేస్తున్నారు నెటిజన్స్. మీరు చెవిరెడ్డి సర్వేలు నమ్ముతున్నారా..  

తెలంగాణ ఎన్నికల సమయంలో కూడా మీరు ఆయనను ప్రగతి భవన్ కి పిలిపించుకొని మరీ ఆయన చేసిన సర్వేల ప్రకారం ఎన్నికల బరిలోకి వెళ్లారు.  100 సీట్లు తప్పక వస్తాయని భావించారు కానీ చివరికి బొక్క బోర్లా పడ్డారు. అయితే ఈ పార్లమెంటు ఎలక్షన్స్ లో కూడా అదే కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. కానీ తెలంగాణలో పరిస్థితులు మరో విధంగా ఉన్నాయి. కేసీఆర్ కు ఎంతో పట్టున్న మెదక్ పార్లమెంట్ సీట్ కూడా గెలిచే పరిస్థితి కనబడడం లేదు. రాష్ట్రంలో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అన్నట్లుగా మారిపోయింది. కేసీఆర్ చుట్టూ ఉండేటటువంటి అప్పటి రాజకీయ  గణమంతా సైలెంట్ అయిపోయింది. కార్యకర్తలు కూడా ఏ పార్టీలోకి వెళ్లాలో  తెలియక ఆలోచనలో పడ్డారు. కార్యకర్తల సమావేశాల పేరుతో ఇండోర్ మీటింగ్ లు తప్ప బహిరంగ సభల్లో ఎక్కడ కూడా కనిపించడం లేదు.

 పరిస్థితులు ఇలా ఉన్న తరుణంలో 8 నుంచి 12 సీట్లు గెలుస్తామని కేసీఆర్ చెప్పుకొస్తున్నారు. దీంతో చాలామంది నెటిజన్స్  చెవిరెడ్డి నివేదికలు మళ్లీ మీరు తెప్పించుకున్నారా  అలా అయితే మళ్లీ బొక్క బోర్లా పడతారు. ఆయన నివేదికలు కరెక్ట్ అయితే మీరు తెలంగాణలో గెలిచేవారు. ఇప్పుడు మీరు జగన్ గెలుస్తారని అంటున్నారు ఎంతో చేసిన మీరే తెలంగాణలో గెలవలేకపోయారు,  జగన్ ఎలా గెలుస్తారని నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు. అయితే కేసీఆర్ కు మాత్రం జగన్ గెలవాలనే కోరిక ఎక్కువగా ఉంది. ఎందుకంటే ఇక్కడ రేవంత్ సీఎంగా ఉన్నారు అక్కడ చంద్రబాబు సీఎం అయితే  కేసీఆర్ పరిస్థితి అంధకారంగా మారుతుంది. వారిద్దరూ కలిసి కేసీఆర్ ను ఎక్కడా కూడా లేవకుండా చేసేస్తారు. అందుకే అక్కడ జగన్ గెలవాలని కేసీఆర్ ఆశపడుతున్నారు. కేసీఆర్ కు తెలుసు జగన్ పరిస్థితి ఎలా ఉందో. కానీ మీదికి జగనే గెలుస్తారని జోస్యం చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: