ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో  జగన్ చంద్రబాబు మధ్య హోరా హోరి పోటీ నడుస్తోంది. ఆంధ్రప్రదేశ్,తెలంగాణ రాష్ట్రం విడిపోయిన తర్వాత మొదటిసారి  రాష్ట్రానికి చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే ఆ తర్వాత జగన్ సీఎం అయ్యారు. ఇప్పుడు మూడోసారి ఎన్నికలు జరుగుతున్నాయి. దీంతో జగన్ మరియు చంద్రబాబు మధ్య విపరీతమైనటువంటి పోటీ ఏర్పడింది. ప్రతి నియోజకవర్గంలో వైసిపి,టిడిపి మధ్య నువ్వా నేనా అన్నట్టు హోరా హోరి పోరు జరుగుతుంది. ఎవరు గెలుస్తారనేది చెప్పడం చాలా కష్టంగా మారింది. అలాంటి జగన్మోహన్ రెడ్డి మరియు చంద్రబాబు నాయుడు మధ్య కేవలం ఎన్నికల్లోనే హోరా హోరీ తలపడకుండా కేసుల్లో కూడా ఒకరి కంటే ఒకరు ఎక్కువగా తలపడుతున్నారు. ఇద్దరిపై అనేక కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం ఎన్నికల సమయంలో ఈ కేసుల గురించి సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది.

 మరి ఎవరిపై ఎలాంటి కేసులు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. చంద్రబాబు పైన 24 కేసులు ఉండగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై 26 కేసులు ఉన్నాయి. చంద్రబాబు కంటే రెండు కేసులు జగన్మోహన్ రెడ్డి పైన ఎక్కువగా ఉన్నాయి. ప్రస్తుతం ఈ ఎన్నికల్లో ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది. అయితే సీఎం జగన్ మోహన్ రెడ్డి పై  గతంలోని అనేక కేసులు ఉన్నాయి. ఇందులో 11 సిబిఐ కేసులు ఉండగా మరో 9 ఈడి కేసులు నమోదయ్యాయి. ఆంధ్ర తెలంగాణ  కలిపి మొత్తం వివిధ పోలీస్ స్టేషన్లో జగన్ పై మరో 6 కేసులున్నాయి.  ఈ కేసులన్నీ కుల మత వర్గాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి అనుచిత ప్రవర్తన పరువు నష్టం కలిగించడం వల్ల  నమోదు చేసినట్టు తెలుస్తోంది. విధంగా అన్ని కలిపి మొత్తం జగన్ పై 26 కేసులు ఉన్నాయి.  

 చంద్రబాబు కేసులు:
 మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై మొత్తం 24 కేసులు నమోదయ్యేయి. ఆయన పై 2019 కంటే ముందే రెండు కేసులు ఉండగా  జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత 22 కేసులు నమోదయ్యాయి. ముఖ్యంగా మంగళగిరి సిఐడి పోలీస్ స్టేషన్లో 8 కేసులు ఉండగా బాబ్లీ ప్రాజెక్టు సందర్శన సందర్భంగా ధర్మపూర్ పోలీసులు  2010లో కేసులు నమోదు చేశారు. తర్వాత ఆళ్లగడ్డ ఉప ఎన్నికల్లో నిబంధనలు ఉల్లంఘించారని  మరో కేసు నమోదు అయింది. ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి  చంద్రబాబు ఎన్నికల్లోనే కాకుండా కేసుల్లో కూడా మొదటి స్థానంలో ఉన్నారని సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: