ప్రస్తుతం తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల వేడి రాజుకుంది. ఇక ప్రధాన పార్టీలుగా కొనసాగుతున్న బిఆర్ఎస్, కాంగ్రెస్, బిజెపి పార్టీలు గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతూ ఉన్నాయి. మెజారిటీ స్థానాల్లో విజయం సాధిస్తామని ధీమాతో ఉన్నాయి. ఈ క్రమంలోనే గెలుపు గుర్రాలను బలిలోకి దింపి ఓటర్ మహాశయులను ఆకట్టుకునేందుకు పావులు కదుపుతూ ఉన్నాయి. ఇక ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా ప్రచార హోరు కనిపిస్తూ ఉంది. అంతేకాదు ఇక అభ్యర్థుల తరఫున ఆయా పార్టీలలోని కీలక నేతలందరూ కూడా ప్రచారం చేస్తూ హామీల వర్షం కురిపిస్తున్నారు అని చెప్పాలి. అయితే ప్రస్తుతం బిఆర్ఎస్, కాంగ్రెస్, బిజెపి పార్టీలు ఒక్క స్థానంలో విజయాన్ని మాత్రం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయ్. అదే సికింద్రబాద్ పార్లమెంట్ సెగ్మెంట్. ఇక్కడ గత రెండు దఫాలుగా బిజెపి ఎన్నిక అవుతూ వస్తుంది. కిషన్ రెడ్డి రెండుసార్లు ఎంపీగా పనిచేశారు. ఇక ఇప్పుడు సిట్టింగ్ ఎంపీగా కేంద్ర మంత్రిగా కొనసాగుతున్న కిషన్ రెడ్డి మరోసారి ఇక్కడ విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టాలని అనుకుంటున్నారు. అయితే ఈ పార్లమెంట్ సెగ్మెంట్లో తమ పార్టీ జెండా ఎగరేయాలని కాంగ్రెస్, బిఆర్ఎస్,  పార్టీలు పావులు కదుపుతూ ఉన్నాయి. బిఆర్ఎస్ నుంచి పద్మారావు గౌడ్.. కాంగ్రెస్ నుంచి దానం నాగేందర్ పోటీ చేస్తున్నారు అన్న విషయం తెలిసిందే. అయితే సికింద్రాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ విషయంలో ఉన్న ఒక సెంటిమెంట్ ని ఇటీవల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి బయట పెట్టాడు. సికింద్రాబాద్లో ఏ పార్టీ గెలుస్తుందో ఆ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తుందని సీఎం రేవంత్ అన్నారు. దత్తాత్రేయను అంజన్ కుమార్ ఓడించినప్పుడు కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఇక ఇప్పుడు 20 ఏళ్ల తర్వాత ఆనాటి రోజులు పునరావృతం కాబోతున్నాయి. సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానంలో కాంగ్రెస్ గెలుస్తుంది. ఇక కేంద్రంలో కూడా సెంటిమెంట్ ప్రకారం కాంగ్రెస్ అధికారాన్ని చేపడుతుంది. అయితే ఇక సికింద్రాబాద్ నుంచి ఎంపీగా గెలిచిన దానం నాగేందర్ కు కేంద్రంలో కీలక బాధ్యతలు దక్కుతాయి అంటూ రేవంత్ వ్యాఖ్యానించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: