గడిచిన కొద్ది రోజుల క్రితం నుంచి ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ పైన జరిగిన గులకరాయి దాడితో ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఉలిక్కి పడ్డాయి. దాడి జరిగిన నిమిషాలలోనే పోలీసులు సైతం  నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారించడం కూడా జరిగింది.. కానీ మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డిని అతి క్రూరంగా చంపారు అయితే ఈ విషయం ఐదేళ్లు గడిచినా కూడా ఇప్పటికీ ఎలాంటి న్యాయం జరగలేదని ఆతన కుమార్తె సునీత ఇటీవల ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు.పులివెందుల నియోజకవర్గం నుంచి వెలిదండ్ల, పార్నపల్లె, ఎగువపల్లి తదితర ప్రాంతాలలో నిన్నటి రోజున సాయంత్రం మేమే రోడ్  షో నిర్వహించింది.. ఈ సందర్భంగా వివేకానంద రెడ్డి కుమార్తె సునీత మాట్లాడుతూ ..తన తండ్రి హత్య కేసులో న్యాయం జరగడం కోసం ఐదేళ్లుగా తాను పోరాడుతూనే ఉన్నానని మీరైనా న్యాయం చేయండి అంటూ ప్రజలను దేహి అంటూ కోరుతోంది. మీ బిడ్డకు చాలా అన్యాయం జరిగిందని మీ దీవెనలు ఆశీస్సులు కావాలంటే ఎవరూ కూడా హంతకులకు ఓటు వేయద్దండి అంటూ పిలుపునిస్తోంది సునీత.


కడప ఎంపీ బరిలో నుంచి వైయస్ షర్మిలను గెలిపించుకుంటే కచ్చితంగా వివేక హత్య కేసుతో పాటు మన కష్టాలను కూడా తీరుస్తుంది అంటూ రోడ్డు షో లో భాగంగా మాట్లాడుతోంది సునీత. రోడ్డు షోలో పులివెందల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి ద్రవ కుమార్ రెడ్డితో పాటు తులసి రెడ్డి తదితర నాయకులతో ఈ రోడ్డు షోని నిర్వహించింది. గత కొద్దిరోజులుగా వైఎస్ వివేకానంద రెడ్డి హత్య విషయంలో పదేపదే జగన్ , అవినాష్ రెడ్డి పేరు ప్రస్తావిస్తూ ఉంటే ఇటీవలే కడప కోర్టు కూడా ఎవరు కూడా ఈ విషయాన్ని ప్రస్తావించకూడదంటూ ఉత్తర్వులను కూడా జారీ చేసింది. అయినప్పటికీ కూడా వాటిని లెక్కచేయకుండా ఇప్పుడు రోడ్డు షో లో సునీత ఇలా మాట్లాడుతూ కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: