ఏ సమాజంలో అయినా ప్రశ్నించే వాళ్ళు లేకపోతే ప్రజాస్వామ్యం ఖూనీ అవుతుందని  తీన్మార్ మల్లన్న నిరూపించారు. జర్నలిస్టు అనే పదానికి నిలువెత్తు నిదర్శనంగా  ప్రభుత్వం చేసే తప్పులను ఎత్తి పొడుస్తూ  ప్రజలను ఆలోచింపజేసేలా చేశాడు. అలాంటి తీన్మార్ మల్లన్న  జర్నలిస్టుగా జీవనం మొదలుపెట్టి  రాజకీయ నాయకుడిగా అరంగేట్రం చేసి దూసుకుపోతున్నారు.  అలాంటి తీన్మార్ మల్లన్న ఎవరు.. ఆ వివరాలు ఏంటో చూద్దాం..
 
జర్నలిస్టు నుంచి రాజకీయం:
మల్లన్న అసలు పేరు చింతపండు నవీన్  కుమార్. 1983 జనవరి 17న  యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం మాధవపురం గ్రామంలో  జన్మించాడు. అలాంటి మల్లన్న ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎంఏ పొలిటికల్ సైన్స్ మరియు హైదరాబాద్ జేఎన్టీయూ నుండి 2009లో ఎంబీఏ పట్టా అందుకున్నాడు. ఆయన చదువుకున్న రోజుల్లో నుంచే  ప్రశ్నించే  తత్వం ఉన్న వ్యక్తి. కాలేజీలో ఎలాంటి తప్పులు జరిగిన ప్రశ్నించేవాడు. అలాంటి మల్లన్న  ఐ న్యూస్, ఎన్టీవీ వంటి ప్రముఖ టీవీ ఛానల్ లో కొన్నాళ్లపాటు జర్నలిస్టుగా పనిచేశారు. 2012లో వి6 న్యూస్ లో  ప్రసారమైన తీన్మార్ వార్తల ద్వారా  చాలా ఫేమస్ అయ్యారు. దీంతో ఈయన పేరు తీన్మార్ మల్లన్న గా మారిపోయింది. కొన్నాళ్లపాటు టీవీ ఛానల్ లో పనిచేస్తూ  ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ జర్నలిస్టుగా ఎంతో గుర్తింపు సాధించారు.


అయితే తాను చేస్తున్న ఈ ప్రోగ్రాం ద్వారా ప్రభుత్వాన్ని ప్రశ్నించడం వల్ల వి6 యాజమాన్యం అడ్డు చెప్పింది. అలాంటి మల్లన్న వి6 న్యూస్ ఛానల్ లో ఉద్యోగానికి రాజీనామా చేసి ప్రభుత్వాన్ని ప్రశ్నించాలంటే తప్పనిసరిగా రాజకీయాల్లో ఉండాలనుకున్నారు. ఆ తర్వాత ఆయన జవహర్ నగర్ ఎన్నికల్లో ఇండిపెండెంట్  పోటీ చేశారు. ఆ తర్వాత ఆయనను గుర్తించిన కాంగ్రెస్ పార్టీ టికెట్ ఖరారు చేసింది. నల్గొండ ఖమ్మం వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి ఈ పార్టీ నుంచి పోటీ చేసి స్వల్ప తేడాతో ఓడిపోయారు. ఆ తర్వాత  కాంగ్రెస్ లో కొంతమంది నాయకుల క్యారెక్టర్ నచ్చకపోవడంతో, బయటకు వచ్చి   క్యూ న్యూస్ ప్రారంభించి  అంచలంచలుగా ఎదిగాడు. ప్రతిరోజు  ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు తెలియజేస్తూ  మరోవైపు టీవీ5 ఛానల్ లో కూడా పనిచేస్తూ వచ్చారు.. అలా ప్రభుత్వాన్ని ప్రశ్నించడం వల్ల మల్లన్న పై ఎన్నో కేసులు పెట్టారు.

 చివరికి 75 రోజులపాటు జైల్లో కూడా ఉంచారు. ఇదే తరుణంలో మల్లన్న బిజెపిలో చేరుతున్నారని తన భార్య  ప్రకటించింది. చివరికి మల్లన్న 2021 డిసెంబర్ 7న  ఢిల్లీలో బిజెపి కేంద్ర కార్యాలయంలో తెలంగాణ పార్టీ వ్యవహారాల ఇంచార్జ్ తరుణ్ చుగ్ ఆధ్వర్యంలో బీజేపీలో చేరారు. ఆ తర్వాత మల్లన్న జైలు నుంచి బయటకు వచ్చారు. అలా కొన్నాళ్లపాటు బిజెపి పార్టీలో ఉన్న మల్లన్నకు  పార్టీ విధివిధానాలు నచ్చలేదు. చివరికి అందులో నుంచి కూడా బయటకు వచ్చేసి  కాంగ్రెస్ పార్టీలో చేరి కేంద్రంలో బిజెపి రాష్ట్రంలో టిఆర్ఎస్ చేస్తున్న అరాచకాల గురించి ప్రతిరోజు లైవ్ ద్వారా ప్రజలకు తెలియజేశారు.

అలా చేస్తున్న క్రమంలోనే  మల్లన్న 2021 లో శాసనసభ మండలికి జరిగిన ఎన్నికల్లో  మరోసారి ఖమ్మం ,వరంగల్, నల్గొండ  పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి  రెండవ స్థానంలో నిలిచారు. అలాంటి తీన్మార్ మల్లన్న అసెంబ్లీ ఎలక్షన్స్ కు ముందు కాంగ్రెస్ పార్టీలో చేరి క్రియాశీలకంగా వ్యవహరించారు. అసెంబ్లీ ఎన్నికల్లో తనకు టికెట్ వస్తుందని భావించారు.  కానీ కాంగ్రెస్ అధిష్టానం ఎమ్మెల్సీ పదవి ఇస్తామని  ఆయనను ఆపేసింది. అయితే మొన్నటి వరకు కరీంనగర్ ఎంపీ టికెట్ మల్లన్నకు ఇస్తారని వార్తలు వచ్చాయి. అది వెలిచాల రాజేందర్ రావుకు వెళ్లిపోవడంతో  మల్లన్నను ఎమ్మెల్సీ అభ్యర్థిగా  ప్రకటించింది కాంగ్రెస్ అధిష్టానం. దీంతో  ఖమ్మం, నల్గొండ,  వరంగల్ స్థానంలో ఈసారి మల్లన్న విజయం ఖాయమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: