ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. రాష్ట్రంలో ఎన్నికల హడావిడి ఒరేంజ్ లో కనిపిస్తోంది. గ్రామ గ్రామాన పార్టీ అధినేతలు, బడా నేతలు పర్యటిస్తూ ప్రచారంలో దూసుకుపోతున్నారు. విమర్శలు, ప్రతి విమర్శలతో మైకులు మారం మోగిపోతున్నాయి. ఇక ఇప్పటికే పలు సర్వే రిపోర్టులు ఇచ్చిన నివేదికలతో ఏ పార్టీ గెలుస్తుంది అనే టెన్షన్ ప్రజల్లో నెలకొంది. ఇలాంటి సమయంలో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసిన కామెంట్లు హార్ట్ టాపిక్ గా మారాయి. ఏపీలో జగన్ గెలుస్తాడని తమకు సమాచారం అందిందని కేసీఆర్ అన్నారు. ఏపీలో ఎవరు గెలిచినా తమకు నష్టం లేదని అన్నారు. కేసీఆర్ చేసిన వ్యాఖ్యలతో వైసీపీలో జోష్ పెరగ్గా కూటమి నేతల్లో ఆందోళన మొదలయ్యింది. కేసీఆర్ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడినప్పటికీ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆంధ్ర సెటిలర్లను ఇబ్బంది పెట్టలేదు. దీంతో ఆయనపై వారికి అభిమానం పెరిగింది. హైదరాబాదులో ఆంధ్ర సెటిలర్లు ఎక్కువగా ఉన్న కూకట్ పల్లి లాంటి ప్రాంతాల్లో సైతంటి బీఆర్ఎస్ విజయకేతనం ఎగరవేసింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అధిక స్థానాల్లో గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటికీ హైదరాబాద్లో బీఆర్ఎస్ పార్టీనే ఎక్కువ స్థానాలు గెలుచుకుంది. దీంతో ఏపీ ఓటర్లకు సైతం కేసిఆర్ పై అభిమానం ఉన్నట్టు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో కేసిఆర్ చేసిన వ్యాఖ్యలు వైసీపీకి సీఎం జగన్ కు లాభం చేకూరుస్తాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే కూటమి నేతలు మాత్రం కేసిఆర్ కామెంట్లను వ్యతిరేకిస్తున్నారు.


కేసీఆర్ జోష్యం చెప్పారా లేదంటే నిజంగానే సమాచారం అందిందా అని ప్రశ్నిస్తున్నారు. కేసీఆర్ చెప్పిందే నిజమైతే అసెంబ్లీ ఎన్నికల్లో తామే గెలుస్తామని కేసీఆర్ చాలా సార్లు అన్నారు. కానీ చివరికి కాంగ్రెస్ గెలిచిందని అలాంటప్పుడు ఏపీలోనూ కేసీఆర్ మాటలకు వ్యతిరేకంగా జరుగుతుందని అభిప్రాయపడుతున్నారు. కాబట్టి కచ్చితంగా ఏపీలో కూటమి పార్టీలు విజయం సాధిస్తాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: