•ఉత్తరాంధ్ర రాజకీయాల్లో సత్తా చాటుతున్న వీర వనితలు
•ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా రాణిస్తున్న ఉత్తరాంధ్ర మహిళలు
ఉత్తరాంధ్ర - ఇండియా హెరాల్డ్: ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో మహిళలు రాజకీయాల్లోకి వచ్చి చక్కగా రాణిస్తున్నారు. ప్రజల మన్ననలు అందుకుంటున్నారు.1972 వ సంవత్సరంలో మాడుగుల నియోజకవర్గం నుంచి బొడ్డు కళావతి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత ఆమెకు విజయనగరం జిల్లాలో పోటీ చేసేందుకు అవకాశం వచ్చినా ఓటమి పాలయ్యారు. ఇక మాడుగుల నియోజకవర్గం నుంచి 1983లో అల్లు భానుమతికి తెలుగుదేశం పార్టీ టికెట్ ఇచ్చింది. అయితే ఆమె నామినేషను తిరస్కరణకు గురికావడంతో డమ్మీగా వేసిన రెడ్డి సత్యనారాయణ అప్పుడు అభ్యర్థి అయ్యారు. 1983లోనే విశాఖ-1 నుంచి గ్రంధి మాధవి తెలుగుదేశం పార్టీ తరపున ఎన్నికయ్యి బాగా రాణించారు. ఆ తరువాత పరిణామాల్లో ఆమె నాదెండ్లకు మద్దతుగా నిలిచారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి