తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ పూర్తయిన నేపథ్యంలో... బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్తు ఏంటని అందరిలోనూ చర్చ నెలకుంది. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో 8 నుంచి 10 సీట్లు గులాబీ పార్టీ సాధిస్తే.. అఖండ విజయాన్ని సాధించినట్లే. అదే గులాబీ పార్టీ.. ఒకటి లేదా మూడు స్థానాలకు పరిమితం అయితే... ఆ పార్టీ భవిష్యత్తు ప్రశ్నార్థకమవుతుంది. అయితే ఈ ఎన్నికల్లో... ఎన్నడూ లేని విధంగా గులాబీ బాస్ కల్వకుంట్ల చంద్రశేఖర రావు... బస్సు యాత్రలు చేసి జనాల మధ్యలో మెదిలారు.


ఆ ఒక్క పాయింట్ గులాబీ పార్టీకి కలిసి వచ్చేలా కనిపిస్తోంది. అయితే ఈ ఎన్నికలు పూర్తికాగానే బిజెపి పార్టీ తెలంగాణ రాష్ట్రంలో కొత్త స్ట్రాటజీ అమలు చేస్తోంది. తెలంగాణలో బలమైన పార్టీగా అవతరించేందుకు బిజెపి పార్టీ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగానే గులాబీ పార్టీని టార్గెట్ చేసింది. త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో గులాబీ పార్టీ విలీనం అవుతుందని బాంబు పేల్చారు బిజెపి ఎంపీ లక్ష్మణ్. కారు పూర్తిగా రిపేర్ కు వచ్చిందని... షెడ్డు కు వెళ్లిన కారు మళ్లీ బయటికి రావడం కష్టమన్నారు. త్వరలోనే తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తాడని.. కేసీఆర్ ను ఉద్దేశించి లక్ష్మణ్ వ్యాఖ్యలు చేశారు.


తెలంగాణ ఏర్పాటు సమయంలోనే... ఈ పని జరగాల్సిన ఉండేదని... కానీ అధికారం కోసం కేసీఆర్ మాట తప్పారన్నారు. ఇక త్వరలో మాత్రం ఈ పని కచ్చితంగా జరుగుతుందని తెలిపారు. అయితే బిజెపి ఎంపీ లక్ష్మణ్... చేసిన వ్యాఖ్యలు ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ... ప్రస్తుతం గ్రౌండ్ స్థాయిలో గులాబీ పార్టీ పరిస్థితి అలాగే కనిపిస్తోంది. ఒక మెదక్ ఎంపీ సీట్లు తప్ప ఎక్కడ గెలిచే పరిస్థితి లేదని రిపోర్ట్స్ వెల్లడిస్తున్నాయి. పార్లమెంట్ ఎన్నికలు కనుక.... అందరూ జాతీయ భద్రత, ప్రధాని నరేంద్ర మోడీ అంశాన్ని దృష్టిలో పెట్టుకొని ఓటు వేశారు. తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి గ్రామాన్ని టచ్ చేస్తే కచ్చితంగా మోడీకి ఓటు వేస్తామని తెలిపారు.


అయితే తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు వస్తే... గులాబీ పార్టీకి మంచి మైలేజ్ వచ్చేది అని అంటున్నారు. కానీ పార్లమెంట్ ఎన్నికల్లో... మోడీకి ఓటు వేస్తామని ప్రతి ఒక్కరు చెబుతున్నారు. ఈ లెక్కన తెలంగాణ రాష్ట్రంలో మెజారిటీ సీట్లను బిజెపి సాధిస్తుందని గెలుస్తోంది. ఆ తర్వాత గులాబీ పార్టీ ఉండే ఛాన్స్ ఉందని స్పష్టo చేస్తున్నాయి సర్వే లు. అయితే ఈసారి అధికార కాంగ్రెస్ పార్టీకి... ఎంపీ సీట్లు వచ్చే పరిస్థితులు చాలా కష్టంగా ఉన్నాయని సర్వే రిపోర్ట్ లు వెల్లడిస్తున్నాయి. ఆరు గ్యారంటీ అమలులో... రుణమాఫీ విషయంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం దారుణంగా విఫలమైందని... జనాల్లో తీవ్రమైన కోపం ఉంది. ఆ కోపాన్ని ఈ పార్లమెంట్ ఎన్నికల్లో జనాలు చూపించే ఛాన్స్ ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: