ఈ నేపథ్యంలో ఏపీ విషయాన్ని చూసుకుంటే.. ఇక్కడ పోలింగ్ పెరిగింది. దీనికి మోడీకి సంబంధం ఉం దా? అనేది పెద్ద చర్చగా మారింది. మోడీ రాక.. ఆయన ప్రసంగాలు.. వంటివి ఏపీ ఎన్నికలను ఏమేరకు ప్రభావం చూపాయనే విషయంలో బీజేపీ ఒక వాదన తెరమీదికి తెస్తే.. కూటమి పార్టీల్లో కొందరు మరోవా దనను తెరమీదికి తెస్తున్నారు. దీనికి కారణం.. మోడీ ప్రకటనలేనని చెబుతున్నారు. ఏపీలో ఆయన మైనారిటీ ఓటు బ్యాంకు గురించి.. వారి రిజర్వేషన్ల గురించి పెద్ద గా ప్రస్తావించలేదు.
కానీ, పొరుగునే ఉన్న హైదరాబాద్‌లో మాత్రం ముస్లింల రిజర్వేషన్లను రద్దు చేస్తామని బీజేపీ అగ్రనేతలు అమిత్ షా వంటివారు పదే పదే చెప్పారు. ఈ ప్రభావం ఏపీపైనా పడుతుందనేది ఓ వర్గం కూటమి నాయకులు చెబుతున్నారు. ఇప్పుడు కనుక జగన్‌ను కాపాడుకోకపోతే.. మైనారిటీలకు నష్టమనే వాదన ఉంది. ఇదే ఎన్నికల పోలింగ్‌పై ప్రభావం చూపిందనేది వీరి మాట. కానీ, బీజేపీ నాయకులు మాత్రం మోడీ రాక, ఆయన చెప్పిన పోలవరం.. తదితర హామీల విషయంలోనే ఏపీ ప్రజలు టర్న్ అయ్యారని అంటున్నారు.
వాస్తవం ఏంటంటే.. మోడీ ప్రభావం ఈ ఎన్నికలపై కంటే.. ఆయన చేసిన వ్యాఖ్యల ప్రభావం ఎక్కువగా ఉందనేది వాస్తవం. దీనిలో జగన్‌ను తిట్టడం వైసీపీని తిట్టడం వంటివి పక్కన పెడితే.. రెండు నాల్కల ధోరణిని అవలంభించారనే వాదన మధ్యతరగతి ప్రజల్లోనే కనిపించింది. గత 2019 ఎన్నికలప్పుడు కూడా.. పోలవరంపై అవినీతి ఆరోపణలు చేసిన మోడీ.. చంద్రబాబును తిట్టిపోశారు. ఇక, ఇప్పుడు వైసీపీని తిట్టారు. మాట ఒక్కటే కానీ.. పార్టీలు, నాయకులు మారారు. దీంతో ఆయన విశ్వసనీయత లేకపోగా.. ఆయన వ్యవహార శైలి మైనస్‌గా మారిందనేది విశ్లేషకుల మాట. ఇది కూటమిపై ఎంత వరకు ప్రభావం చూపుతుందనేది చూడాలి.