ఏపీ ఎన్నికల ఫలితాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు.రాష్ట్రంలో ఇంకోసారి తామే అధికారంలోకి రాబోతున్నామని సీఎం వైఎస్‌ జగన్‌ అన్నారు.ఈసారి ఎన్నికల ఫలితాల్లో 22 ఎంపీ సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. ప్రశాంత్ కిషోర్ కూడా అంచనా వేయని విధంగా సీట్లు రాబోతున్నాయని జగన్ అన్నారు.జగన్‌ గురువారం విజయవాడ బెంజ్‌ సర్కిల్‌లోని ఐ ప్యాక్‌ కార్యాలయంలో టీం సభ్యులను కలిశారు. ఈ సందర్భంగా టీం సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ కోసం పని చేసినందుకు ఐ ప్యాక్‌ టీం సభ్యులకు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా టీం సభ్యులతో మాట్లాడుతూ మరోసారి ఏపీలో అధికారంలోకి వస్తున్నామని స్పష్టం చేశారు.

ఏపీ ఫలితాలు చూసి… దేశం మొత్తం షాక్ కాబోతుందని ఏపీ సీఎం వైస్ జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ప్రభుత్వంలో ఈ ఐదేళ్ల కంటే ఎక్కువగా ప్రజలకు మేలు చేద్దామన్నారు ఏపీ సీఎం వైస్ జగన్. రానున్న రోజుల్లో ఈ ప్రయాణం ఇలానే కొనసాగుతుందని పేర్కొన్న జగన్…ఎక్కువ సీట్లే సాధించబోతున్నట్లు తెలిపారు. ప్రజలకు ఈ ఐదేళ్లకు మించిన గొప్ప పాలన అందిస్తామని….ఐ ప్యాక్ టీం చేసిన సేవలు వెలకట్టలేనిదని వివరించారు. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నామని స్పష్టం చేశారు ఏపీ సీఎం వైస్ జగన్.

ఐప్యాక్ టీం కు సంబందించి మీరు ఏడాదిన్నరగా అద్భుతంగా పనిచేశారు. మీ కృషి వల్లే టార్గెట్‌ను సాధించగలుగుతున్నాం. రిషీ చేసిన ఎఫర్ట్ కూడా చాలా గొప్పది. చాలా మందికి ప్రశాంత్ కిషోర్ ఏం చేస్తున్నారో తెలియడం లేదు. ప్రశాంత్ కిషోర్ కన్నా రిషీ టీం చాలా వర్తీ. ఏపీ రిజల్ట్స్ దేశంలోని ప్రతీ ఒక్కరిని ఆశ్చర్యపరుస్తాయి. జూన్ 4న వచ్చే నెంబర్లు గతంలో ప్రశాంత్ సాధించిన వాటికన్నా గొప్పగా వస్తాయి. ఎన్నికల తరువాత కూడా మీ టీం సేవలు కొనసాగించండి అని సీఎం జగన్ కొనియాడారు.

మరింత సమాచారం తెలుసుకోండి: