గత ఎన్నికలతో పోల్చుకుంటే ఈ ఎన్నికలు ఒక యుద్ధాన్ని తలపించాయనే చెప్పాలి . ముఖ్యంగా అటు కూటమి ఇటు అధికార పార్టీ వైసిపి పోటాపోటీగా అధికారంలోకి తాము వస్తామంటే తాము వస్తామంటూ ధీమా వ్యక్తం చేస్తున్నాయి.. మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ఒంటరిగా పోరాడలేక అటు బిజెపి ఇటు జనసేనతో పొత్తు పెట్టుకుని కూటమిగా ముందుకు సాగారు.. పలు ప్రాంతాలలో కొన్ని సామాజిక వర్గాలను కలుపుకొని తాము అధికారంలోకి రావాలని ఎంతో ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఇటువంటి ప్రయత్నాలు ఏవి చేయకుండా కేవలం బస్సు యాత్ర,  మేమంతా సిద్ధం,  సిద్ధం సభలతో జగన్ చేపట్టిన ప్రచారాలు ఆయనకు ప్రజలలో ఎంత గుర్తింపు ఉందో మరొకసారి గుర్తు చేశాయి. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు మళ్లీ తామే అధికారంలోకి వస్తామని స్పష్టం చేస్తున్నారు వైయస్ జగన్..

ఇంత ధైర్యంగా ఆయన మళ్లీ మేము అధికారంలోకి వస్తామని చెప్పడానికి కారణం ఏంటి?  ఆయనలో ఇంత ధీమా ఎక్కడి నుంచి వచ్చింది.. వై నాట్ 175 అంటూ చెబుతున్న ఈయనకు ఇంత ధైర్యం రావడానికి కారణం కేవలం రెండు సెకండ్ల వీడియో అనే చెప్పాలి.. ఈ ఒక్క రెండు సెకండ్ల వీడియోతో ఆంధ్రప్రదేశ్ నే షేక్ చేసేస్తున్నారు. లేకపోతే ఈయనకు ఇన్ని సీట్లు రావడం వెనుక అసలు కారణం ఆయన ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలే ప్రధాన కారణం.. ఇకపోతే ఈ పథకాల వల్ల రాష్ట్రంలోని ప్రతి కుటుంబం కూడా లబ్ధి పొందింది. వృద్ధాప్య పింఛన్ మొదలుకొని పిల్లల అమ్మఒడి, ఈబీసీ నేస్తం, వైయస్సార్ కాపు నేస్తం, చేయూత ఇలా మొత్తం తొమ్మిది సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి ప్రతి కుటుంబానికి ఆయన ఏదో ఒక రూపంలో సహాయపడ్డారు.. ముఖ్యంగా తనకు ఓటు వేయని వారికి కూడా డబ్బులు అందించి వారి మన్ననలు పొందారు సీఎం జగన్..

ముఖ్యంగా పల్లెటూర్లలో ఉంటే రెండు సెంట్ల స్థలం,  పట్టణాల్లో ఉంటే ఒకటిన్నర సెంట్ స్థలం అంటూ ఉచితంగా ఇల్లు కట్టించడం జరిగింది. పైగా ప్రతి కుటుంబం కూడా ఈ సంక్షేమ పథకాలలో ఏదో ఒక పథకానికి అర్హులైన వారు ఇలా అందరూ కూడా ఆయన పథకాలను పొందారు.. కాబట్టే ఆయనకే ఓటు వేశారన్న ధీమా ఇప్పుడు జగన్లో చాలా ఎక్కువగా కనిపిస్తోంది.. ఇక తాజా సర్వేలు కూడా మళ్లీ ఆయననే సీఎం చేస్తున్నాయని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: