ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల ముందు రాజకీయాల్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీవ్ర దుమారం రేపింది.ఈ యాక్ట్ పై  అధికార, ప్రతి పక్షాలు మధ్య తీవ్ర స్థాయి లో మాటల యుద్ధం జరిగింది..ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై విపక్షాలు తీవ్ర ఆరోపణలు చేసాయి.. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వస్తే పేద ప్రజల భూములను ప్రభుత్వం లాగేసుకుంటుంది.అవసరం అయితే తాకట్టు కూడా పెడుతుంది అని ప్రతిపక్ష పార్టీలు తీవ్ర ఆరోపణలు చేసాయి..అలాగే తాను అధికారంలోకి వస్తే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై తన రెండో సంతకం చేస్తాను అని చంద్రబాబు ఎన్నికల ప్రచారం చేసారు.అయితే తాజాగా ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వ్యవహారం లో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన చేసింది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై జరుగుతున్న దుష్ప్రచారానికి చెక్ పెడుతూ ఈ చట్టం వలన ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని నీతి ఆయోగ్ కితాబు ఇచ్చింది. 

ఈ చట్టం తో భూమిపై రైతులకు సర్వ హక్కులు లభిస్తాయని నీతి ఆయోగ్ తెలిపింది. అయితే ప్రభుత్వం రైతుల భూములు లాక్కునే పరిస్థితి అస్సలు ఉండదని తెలిపింది.ల్యాండ్ టైటిలింగ్ చట్టం అమల్లోకి వస్తే భూ పరిపాలన మరింత గా సులువు అవుతుందని తెలిపింది. పటిష్టమైన భూ యాజమాన్య నిర్వహణ వల్లనే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ముఖ్య ఉద్దేశం అని నీతి ఆయోగ్ ప్రకటించింది. అయితే ఈ చట్టం వల్ల భూములన్నీ మరింత భద్రంగా వుంటాయని తెలిపింది.. దీంతో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై జరుగుతున్న దుష్ప్రచారానికి నీతి అయోగ్ చెక్ పెట్టింది.రాష్ట్రం లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చాలా మెరుగ్గా ఉందని నీతి ఆయోగ్ కితాబిచ్చింది. ఆర్టీఐ ద్వారా వెంకటేష్ వేసిన అప్లికేషన్ మేరకు నీతి ఆయోగ్ ఈ సమాచారం వెల్లడించినట్లు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: