ఎన్నిక‌ల పోలింగ్ జ‌రిగిన సోమవారం రోజు.. చివ‌రి రెండు గంట‌ల వ్య‌వ‌హారంపై రాజ‌కీయ దుమారం రేగిం ది. ఉద‌యం 7 గంట‌ల‌కే పోలింగ్ ప్రారంభ‌మైనా.. చాలా న‌గ‌రాల్లో అవాంత‌రాలు వ‌చ్చాయి. అయినా.. పోలింగ్ సాగింది. ఇది సంప్ర‌దాయ ఓట‌ర్ల వ్య‌వ‌హారంగానే ఉంది. అంటే.. ప‌రిస్థితుల‌తో సంబంధం లేకుండా.. ఉద‌యాన్నే బూతుల‌కు వ‌చ్చే వారే ఉద‌యం 10 గంట‌ల వ‌ర‌కు పోటెత్తారు. ఇది ఎక్క‌డైనా ఉండేదే. అంతేకాదు.. అన్ని చోట్లా కూడా.. ఇదే క‌నిపించింది.


ఎటొచ్చీ.. సాయంత్రం 4 త‌ర్వాత కూడా.. కొన్ని పోలింగ్ బూతులు.. అప్ప‌టి వ‌ర‌కు ఖాళీగా ఉన్న‌వి.. త‌ర్వా త.. ఓట‌ర్ల‌తో పోటెత్తాయి. దీనిపై నే ఇప్పుడు ఎక్కువ‌గా చ‌ర్చ‌లు సాగుతున్నాయి. దీనికి కార‌ణం.. తామం టే తామేన‌న్న‌ది వైసీపీ, టీడీపీ కూట‌మి చెబుతున్న మాట‌. కొన్ని జిల్లాల్లో అయితే.. అర్ధ‌రాత్రి, ఆ త‌ర్వాత కూడా పోలింగ్ న‌మోదైంది. ఇది స‌హ‌జంగానే ఓటర్లు క‌దిలిన వ్య‌వ‌హారం అయితే కాదు. తెర‌వెనుక ఏదో జ‌రిగింది! 2019లోనూ ఇలానే జ‌రిగింది.


ఈప‌రిణామాల‌ను అంచ‌నా వేస్తే.. ఒక‌టి.. వైసీపీకి సానుకూలంగా ఓటు బ్యాంకు ప‌డ‌లేద‌న్న వాద‌న‌తోనే ఓట‌ర్లు క‌దిలార‌ని ఆ పార్టీ నేత‌లు చెబుతున్నారు. ఇది నిజ‌మే కూడా కావొచ్చ‌ని విశ్లేష‌ణ‌లు చెబుతు న్నాయి. ఇక‌, కూటమి విష‌యానికి వ‌స్తే.. ఆ పార్టీ నేత‌ల‌పై కంటే కూడా.. చంద్ర‌బాబు చూపించిన చొర‌వ కార‌ణంగా ఓట్లు పెరిగాయ‌నే విశ్లేష‌ణ‌లు వ‌స్తున్నాయి. అంటే.. చివ‌రి నిముషంలో ఓటింగ్ ప‌ర్సంటేజ్ అనుకున్న విధంగా రాక‌పోవ‌డం.. అంటే.. 68.7 శాతం వ‌ర‌కే న‌మోదైంది.


సాధార‌ణంగా.. ఎక్క‌డైనా 70 శాతానికి పోలింగ్ చేరినా.. త‌ర్వాత కు చేరినా.. అది.. ప్ర‌భుత్వానికి వ్య‌తిరేక‌మ నే టాక్ ఉంది. కానీ, సాయంత్రం 4 గంట‌ల వ‌ర‌కు కూడా పోలింగ్ 60 శాతానికి మాత్ర‌మే చేరింది. దీంతో అలెర్ట‌యిన చంద్ర‌బాబు ఓట‌ర్ల‌కు ప‌దే ప‌దే విజ్ఞ‌ప్తి చేశారు. వెళ్లి ఓటేయాల‌ని చెప్పారు. దీంతో సాయంత్రం 5గంట‌ల త‌ర్వాత‌.. ఓట‌ర్లు రాష్ట్ర వ్యాప్తంగా పోటెత్తారు. దీంతో సాధార‌ణ స‌మ‌యం మించి అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ(మ‌న్యం త‌ప్ప‌) సాయంతం 7 గంట‌ల వ‌ర‌కు కూడా సాగింది. దీంతో ఇది త‌మ ఎఫెక్టేన‌ని కూట‌మి చెబుతోంది. ఎలా చూసుకున్నా.. ఇరు పార్టీల ప్ర‌య‌త్నం కూడా ఉంది. కానీ, ఎవ‌రు అనుకూలం. అనేది తేలాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: