సాధారణంగా రాష్ట్ర హోంమంత్రికి చాలా పవర్ఫుల్ ఉంటాయి. రాష్ట్రంలోని లా అండ్ ఆర్డర్ వారి చెప్పు చేతల్లో ఉంటుంది. ముఖ్యంగా పోలీసులపై హోం మంత్రికి ఉన్న పవర్ మరెవరికి ఉండదు. 2014కు ముందు దేవేంద్ర గౌడ్, జానారెడ్డి, సబిత ఇంద్రారెడ్డి హోం మంత్రి శాఖలో పని చేశారు. వారందరూ కూడా ఆ హోదాలో చేయాల్సిన పనులను సక్రమంగా నిర్వర్తించి మంచి గౌరవాన్ని సంపాదించారు. రాష్ట్ర విభజన తర్వాత హోం మంత్రి అయిన వారు ఉత్త డమ్మీలుగా ఉంటున్నారే తప్ప అధికారాన్ని సద్వినియోగం చేసుకోలేకపోతున్నారు. పోలీసులను పర్ఫెక్ట్ గా నడిపించలేకపోతున్నారు.

 ఏపీ తెలంగాణ రెండు రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొన్నది. తెలంగాణలో ఒక ముస్లిం మంత్రిగా పనిచేశారు. వారి పనులను ముఖ్యమంత్రి చేశారే తప్ప వారి ఏమీ చేయలేదు. ఏపీ విషయానికొస్తే మేకతోటి సుచరిత కూడా తన పనులను ఆమె చేయలేకపోయారు. చినరాజప్ప పరిస్థితి అయితే మరీ దారుణం అని చెప్పుకోవచ్చు హోం మంత్రి పవర్స్ ఏవీ కూడా ఆయన ఉపయోగించుకోలేకపోయారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో హోం వ్యవహారాల శాఖ మంత్రిగా తానేటి వనిత పని చేస్తున్నారు. వనిత కూడా ఐదేళ్ల లోన్ చివరిదాకా తన పవర్స్ ను ఫుల్ గా వినియోగించుకోలేకపోయారు. చిన్న స్థాయి నుంచి వచ్చి ఓ మంత్రి పదవిలో ఉన్నవారు ఆ అధికారాలను తప్పనిసరిగా వినియోగించుకోవాలి. అప్పుడే ఆ ఘనతకు ఒక అర్థం ఉంటుంది.  

 అయితే వనితకు ఈ విషయం చివరికి బోధపడినట్లు ఉంది. ఆమె తాజాగా కొన్ని కీలక ఆదేశాలను జారీ చేశారు. ఆమె రాష్ట్ర డీజీపీ హరీష్ గుప్తాతో మంగళవారం ఫోన్ కాల్ ద్వారా మాట్లాడారు. అసెంబ్లీ, పార్లమెంటరీ పోలింగ్ సమయంలో తలెత్తిన కొన్ని హింసాత్మక సంఘటనలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఏపీలోని పలు ప్రాంతాల్లో టీడీపీ నేతలు, కార్యకర్తలు చేసిన దాడుల గురించి ఆమె డీజీపీతో మాట్లాడారు. ఎమ్మెల్యేల పై దాడులు జరుగుతున్నా స్థానిక పోలీసులు చోద్యం చూస్తూ ఉండిపోయారని ఫిర్యాదు చేశారు. టిడిపికి ఓటు వేయడం లేదని ఆ పార్టీ వారు మహిళలు వృద్ధులపై దాడులు చేస్తున్నారని కూడా చెప్పారు. వీటి పై ఫిర్యాదు చేసిన నిమ్మకు నీరెత్తినట్లు పోలీసులు వ్యవహరించారని ధ్వజమెత్తారు. టీడీపీ దౌర్జన్యాలకు అడ్డుకట్ట వేయకపోతే ఎస్సీ ఎస్టీ మహిళల నుంచి ఏమిరా ప్రతిఘటన ఎదుర్కొనే ప్రమాదం ఉందని హెచ్చరించారు. దాడులకు పాల్పడిన టీడీపీ వారిని వెంటనే అరెస్టు చేయాలని కూడా ఆదేశించారు. 2014 తర్వాత ఈ రేంజ్ లో అధికారాన్ని ఉపయోగించిన ఏకైక హోం మంత్రి వనిత మాత్రమే అని చెప్పవచ్చు. ఆ కోణంలో ఆమె ఏపీ హిస్టరీలో సంచలనం క్రియేట్ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: