పాన్ ఇండియా హీరోయిన్ రష్మిక మందన్న పుష్ప యానిమల్స్ సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ తన ఖాతాలో వేసుకుంది. ఈ రెండు సినిమాల తర్వాత ఈ తార టాప్ ఇండియన్ హీరోయిన్లలో ఒకటిగా మారిపోయింది. కన్నడ ఇండస్ట్రీకి చెందిన ఈ బామ్మ తెలుగులో స్టార్ హీరోయిన్‌ అయిపోయింది. ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీ ని కూడా షేర్ చేస్తోంది అక్కడ పలు సినిమా అవకాశాలతో దూసుకుపోతోంది. ముంబైలోనే ఎక్కువ సమయం గడుపుతున్న ఈ ముద్దుగుమ్మ ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్ బ్రిడ్జి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఒక వీడియో రిలీజ్ చేసి మరీ దాని విశేషాలను వివరించింది. రెండు గంటల జర్నీని కేవలం 20 నిమిషాలకు సదరు వంతెన తగ్గించిందని తెలిపింది.

ఈ 21.8 కిమీల 6-లేన్ ఎలివేటెడ్ హైవే బ్రిడ్జికి "అటల్ సేతు" అని పేరు పెట్టారు. దీని గురించి ఒక ట్వీట్ చేస్తూ వీడియోను కూడా జోడించింది రష్మిక. "బ్రిడ్జి దక్షిణ భారతదేశం నుంచి ఉత్తర భారతదేశం.. పశ్చిమ భారతదేశం నుంచి తూర్పు భారతదేశ ప్రజలను, హృదయాలను కనెక్ట్ చేస్తోంది." అని ఈ వంతెన ప్రాముఖ్యతను ఆమె సింపుల్‌గా ట్వీట్ చేసింది. "అవును ప్రజలను కలపడం, వారి జీవితాలను మెరుగుపరచడం వల్ల కలిగే సంతృప్తి మరి ఏ పని చేసినా రాదు." అని మోదీ రష్మిక ట్వీట్ కోట్‌ చేస్తూ కామెంట్ చేశారు. ఈ అనూహ్య రిప్లై మోదీ నుంచి రావడంతో రష్మిక ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు.

రష్మిక కారణంగా ఈ ఇండియాస్ లాంగెస్ట్ సీ బ్రిడ్జ్ గురించి చాలామంది తెలుసుకోగలిగారు. రష్మిక వీడియోలో ఈ వంతెన హైవే లేన్స్‌ చూడవచ్చు మంచి విజువల్స్ అందించారు. ఇలాంటి హైవే బ్రిడ్జి ఇండియాలో అందుబాటులోకి రావడం నిజంగా హర్షణీయం. ఇలాంటి రవాణా సదుపాయాలు మరిన్ని అందుబాటులోకి రావాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారు. అయితే అభివృద్ధికి ఓటేస్తే ఇలాంటి బ్రిడ్జిలు ఇంకా వందల సంఖ్యలో అందుబాటులోకి వస్తాయని రష్మిక ఆ వీడియోలో తెలిపింది. బీజేపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ మాట రష్మిక చేత చెప్పించారేమో అని పలువురు కామెంట్లు చేస్తున్నారు. ఏదేమైనా ఈ బ్రిడ్జ్ ఏడేళ్లలో నిర్మించి బీజేపీ సర్కార్ అందరి ప్రశంసలను అందుకుంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

pm