భారతదేశంలో ఇంతకుముందు బీజేపీ అంటే ప్రజలు చెవి కోసుకునేవారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వమే ఉండాలని చాలామంది కోరుకునేవారు. అందుకోసం కళ్ళు మూసుకొని బీజేపీకి ఓట్లు వేసేస్తూ గెలిపించే వారు కానీ 2024 పార్లమెంటు ఎన్నికలలో ఓటర్లలో బిజెపి పట్ల ప్రేమ కనిపించడం లేదు మీడియాకి విషయం అర్థం అవుతూనే ఉంది. అమిత్ షా వంటి నేతలకు కూడా ఈ విషయం స్పష్టంగా తెలుస్తోంది కానీ వారు ఒప్పుకోవడం లేదు. తమకు ఎక్కువ సీట్లు వస్తాయని పైకి చెప్పుకుంటున్నారు కానీ ఈసారి 60 నుంచి 100 వరకు వాళ్లకు సీట్లు తగ్గే అవకాశం ఉందని తెలుస్తోంది.

బీజేపీ ట్యాక్స్‌లు ఎక్కువ వసూలు చేస్తోంది. అంతేకాకుండా పెట్రోలు, గ్యాస్ వంటి వాటిపై రేట్లు పెంచేస్తూ పేద మధ్య తరగతి ప్రజల నడ్డి విరుస్తోంది. మోదీ అన్ని దేశాలు తిరగడం తప్పించి పేదవాడి బాధలను అర్థం చేసుకోవడం లేదనే విమర్శ ఎప్పటినుంచో వినిపిస్తోంది. ఒక చైనా ఒక జపాన్ లాగా దేశాన్ని ఆయన ఎందుకు ఇంకా అభివృద్ధి చేయలేకపోతున్నారని చాలామంది ప్రశ్నిస్తున్నారు. బీజేపీ కేంద్రంలో అధికారం నుంచి తప్పుకోవాలని ఆశతో ఇండియా కూటమికి ఎక్కువగా ఓట్లు వేస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ ఎప్పుడూ హిందువుల సెంటిమెంట్ వాడుకుంటారు. ఈసారి రామ జన్మభూమి అయోధ్యలో నిర్మించే అది తన ఘనతే అని చెప్పుకున్నారు. నిజానికి శ్రీరాముడికి గుడి కట్టడంలో తప్పులేదు కానీ దానిని రాజకీయాల కోసం వాడుకుంటా అంటే మాత్రం ప్రజలు ఒప్పుకోరు. ఎన్నాళ్ళు ఈ సెంటిమెంట్ వాడుకొని ఓట్లు గెలుచుకుంటారనే తిరుగుబాటు వారిలో ఇప్పుడు కనిపిస్తున్నట్లు తెలుస్తోంది.

మోడీ ఈసారి ఒక కొత్త ఎత్తు వేశారు. ముస్లిం మైనారిటీలకు రిజర్వేషన్లను పూర్తిగా తొలగిస్తామని చెబుతూ హిందువుల ఓట్లను పొందాలని అనుకున్నారు కానీ దానివల్ల మంచికంటే చెడే ఎక్కువగా జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. హిందువులు మోదీని నమ్మకపోగా ముస్లింలు ఆయనకు వ్యతిరేకమయ్యారు. 2019తో పోలిస్తే యూపీలో 7-8 సీట్లు, రాజస్థాన్‌లో 4-5 సీట్లు, గుజరాత్‌లో 2-3 సీట్లు, ఢిల్లీలో 2-3 సీట్లు, హిమాచల్ ప్రదేశ్‌లో 1-2, హర్యానాలో 2-3 సీట్లు, కర్నాటకలో ఏకంగా 7-9 ఎంపీ సీట్లు, బీహార్, మహారాష్ట్రలో 6-7 సీట్లు బీజేపీ కోల్పోవచ్చని పొలిటికల్ అనలిస్టులు చెబుతున్నారు. దీనివల్ల బీజేపీ చాలా వీక్ అయిపోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: