ఏపీ సీఎం జగన్ శుక్రవారం రోజు గన్నవరం విమానాశ్రయం నుంచి లండన్ బయలుదేరారు. ఆయన ప్రత్యేక విమానంలో విదేశాలకు బయలుదేరారు. ఆ విమానం గంటకు రూ.12 లక్షల ఫీజు తీసుకుంటుందని సమాచారం. ఈ విషయాన్ని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి రిపోర్ట్ చేసింది. ఇందులో నిజం ఎంతో తెలియాల్సి ఉంది. అయితే ఇప్పుడు ఇది కాదు ఏపీలో చర్చినీయాంశమయ్యింది, దీనికంటే మరొక ముఖ్యమైన విషయం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో పెద్ద చర్చకు దారితీసింది. అదేంటంటే గన్నవరం విమానాశ్రయంలో జగన్ వచ్చిన అంటే శుక్రవారం రోజే ఒక వ్యక్తి అనుమానాస్పదంగా తిరుగుతూ కనిపించాడు.

ఆ వ్యక్తి అనుమానంగా తిరగడాన్ని పోలీసులు గమనించి వెంటనే అదుపులోకి తీసుకున్నారు. అతడి పేరు లోకేష్ అని తెలిపారు. అయితే అతడు మన భారతదేశానికి నివసించే వ్యక్తి కాదు. అమెరికాలో ఉంటూ అక్కడ పౌరసత్వాన్ని కూడా సంపాదించాడు. అయితే ఆ వ్యక్తి గురించి ఒక్కోటిగా కొన్ని ఆసక్తికర విషయాలు బయటపడుతున్నాయి. లోకేష్ ఇండియాకి వచ్చాక పలు యూట్యూబ్ ఇంటర్వ్యూలలో పాల్గొంటూ జగన్ కంటైనర్ల కొద్దీ డబ్బును గుజరాత్ రాష్ట్రానికి తరలిస్తున్నారు అని ఆరోపించినట్లు తెలిసింది.

ఈ వ్యక్తి జగన్ కంటైనర్ల ద్వారా మోదీకి డబ్బులు పంపిస్తున్నారని చేసిన ఆరోపణలు ఏపీలో బాగానే పాపులర్ అయ్యాయి. ప్రముఖ టీవీ ఛానల్స్‌ కూడా కంటైనర్లపై ఫోకస్ చేసి, వాటిపై నిఘా పెట్టి స్పెషల్ కథనాలు కూడా వినిపించాయి. ఒక కంటైనర్ జగన్ ఆఫీస్ కు వచ్చింది, తర్వాత వెళ్ళిపోయింది, గంటసేపు ఒక చోటే ఉంది, అందులో ఏముందో తెలియ రాలేదు అంటూ ఒక క్యూరియాసిటీని పెంచేసాయి. జగన్ పంపిస్తున్న డబ్బుల గురించి తనకు తెలుసు అని, ఆ వివరాలను బయట పెడతానని ఎన్నారై లోకేష్ కొన్ని బెదిరింపుల లాంటి వ్యాఖ్యలు కూడా చేశాడు.

 ఇంత కథ నడిపిన లోకేష్ జగన్ వచ్చిన రోజే విమానాశ్రయంలో అనుమానాస్పదంగా తిరగడం పలు అనుమానాలకు తావు ఇచ్చింది. అతడిని అరెస్టు చేయగానే తనకు గుండెనొప్పి వచ్చింది అని చెప్పాడట వెంటనే పోలీసులు విజయవాడలోని ఆయుష్ ఆసుపత్రికి తరలించారు. అతను విమానాశ్రయానికి ఎందుకు వచ్చాడు? ఏదైనా ఎటాక్ ప్లాన్ చేశాడా లేదా కుట్ర చేయబోతున్నాడా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేయాలని వెయిట్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: