- టీడీపీ వాళ్ల‌కు టిక్కెట్లు ఇచ్చిన చోట సొంత పార్టీ నేత‌ల వెన్నుపోట్లు
- జ‌న‌సేన‌లో పైకి క‌నిపించ‌ని పోతిన మ‌హేష్‌లు చాలా మంది..!
- జ‌న‌సేన ఓడితే సొంత వాళ్ల కుట్రే అని ప‌వ‌న్ అంటాడా ?

( గుంటూరు - ఇండియా హెరాల్డ్ )

పోతిన మ‌హేష్ గురించి తెలిసిందే క‌దా!  జ‌న‌సేన పార్టీలో తీవ్రంగా శ్ర‌మించిన నాయకుడ‌. విజ‌య‌వాడ వెస్ట్ టికెట్‌ను కూడా ఆశించారు. అయితే.. ఆయ‌న‌కు టికెట్ రాక‌పోవ‌డంతో దూర‌మ‌య్యారు. అంతేకాదు.. పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌పై తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించారు. వ్య‌క్తిగ‌త విష‌యాల నుంచి పార్టీ వ్య‌వ‌హారాల వ‌ర‌కు కూడా పోతిన రోడ్డున ప‌డేశారు. మొత్తానికి ఎన్నిక‌ల కు ముందు పోతిన ఒక సంచ‌ల నంగా మారారు.


పోతిన‌.. కేవ‌లం జ‌న‌సేనను విమ‌ర్శించ‌డం వ‌ర‌కే ప‌రిమితం కాలేదు. ప‌శ్చిమ టికెట్ విష‌యంలో కూట‌మి కి వ్య‌తిరేకంగా కూడా ఆయ‌న చ‌క్రం తిప్పారు. బీజేపీ అభ్య‌ర్థి సుజ‌నాకు కంట్లో న‌లుసుగా మారారు. దీంతో కూట‌మి అభ్య‌ర్థి ఇక్క‌డ చెమ‌టోడ్చాల్సిన ప‌రిస్థితిని తెచ్చుకున్నారు. క‌ట్ చేస్తే.. ఇలాంటి పోతిన మ‌హేష్‌లు జ‌న‌సేన‌లో చాలా మంది ఉన్నారు. అయితే.. వారు ఈయ‌న మాదిరిగా బ‌య‌ట ప‌డ‌లేదు. మ‌న‌సులోనే బాధ‌ను దాచుకుని.. బ‌య‌ట‌కు క‌నిపించ‌కుండా చేసుకున్నారు.


అలాగ‌ని ప‌వ‌న్‌పై ప్రేమ‌ను మాత్రం కురిపించ‌లేదు. కురిపించినా.. మాట‌ల‌కు మాత్ర‌మే ప‌రిమితం చేశా రు. ఇక‌, త‌మ క‌డుపులో మంట‌ను మాత్రం మ‌రో రూపంలో వెళ్ల‌గక్కారు. నియోజ‌క‌వ‌ర్గాల్లో ప్ర‌చారానికి రాకుండా త‌మ పంథాను చాటుకున్నారు. ఉదాహ‌ర‌ణకు భీమ‌వ‌రం, అవ‌నిగ‌డ్డ నియోజ‌క‌వ‌ర్గాల్లో టీడీపీ నేత‌ల‌ను పార్టీలోకి తీసుకుని.. టికెట్ ఇచ్చారు. దీంతో అక్క‌డి జ‌న‌సేన నాయ‌కులు హర్ట‌య్యారు. దీంతో పైకి ప‌వ‌న్ ను ఏమ‌న్నా.. ప్ర‌యోజ‌నం లేద‌ని పోతిన మ‌హేష్ మాదిరిగా.. ఎదురు దాడి ఎదుర్కొనాల్సి ఉంటుంద‌ని అంచ‌నా వేసుకున్నారు.


ఈ క్ర‌మంలో వారు చేయాల‌ని అనుకున్న ప‌నిని వారు చేశారు. ఎన్నిక‌ల పోలింగ్‌కుముందు రోజు.. తమ వారిని క్రాస్ ఓటింగ్ చేసేలా ప్రోత్స‌హించారు. ఎన్నిక‌ల ప్ర‌చారానికి కూడా దూరంగా ఉన్నారు. ఇక‌, తిరుప‌తిలోనూ.. కిర‌ణ్ రాయ‌ల్ వంటి వారు ఇదే ప‌నిచేశారు. ప్ర‌చారానికి క‌డు దూరంగా ఉన్నారు. వైసీపీకి చెందిన నేత‌ను పార్టీలోకి తీసుకుని టికెట్ ఇవ్వ‌డంపై అంత‌ర్గ‌తంగా నూ గాభ‌రా చెందారు. మొత్తానికి రేపు జ‌న‌సేన క‌నుక ఓడిపోతే.. ప‌వ‌న్ చెప్పే తొలి మాట‌.. అంత‌ర్గ‌త శ‌త్రువుల‌ను గుర్తించ‌లేక పోయామ‌ని.. ఇక‌, రాజ‌కీయంగా వినిపించే మరో మాట‌.. ప‌వ‌న్ చేసిన ప‌నితోనే.. ఓడిపోయార‌ని..!!

మరింత సమాచారం తెలుసుకోండి: