ప్రతి తెలంగాణ ఏర్పడిన తర్వాత మొదటిసారి ప్రతిపక్షంలోకి వచ్చిన బిఆర్ఎస్ పార్టీ పరిస్థితి మళ్లీ మొదటికే వచ్చింది. ఒకప్పుడు పెద్దగా చెప్పుకోదగ్గ నాయకులూ లేకుండా.. ఇక ఎలాంటి మద్దతు ఒంటరి పోరాటం చేసిన బిఆర్ఎస్కు ఇక ఇప్పుడు ఇలాంటి విపత్కర పరిస్థితులు ఎదురయ్యాయి. ఎందుకంటే ఆ పార్టీ ప్రతిపక్షంలోకి వచ్చిందో లేదో అంతలోనే ఇక పార్టీలోని కీలక నేతలు అందరూ కూడా కారు దిగి కాంగ్రెస్ చేయి అందుకున్నారు.


 ఇక కెసిఆర్ నమ్మిన బంటులా ఉన్న నేతలు సైతం ఇలా గులాబీ పార్టీని వీడటంతో ఊహించని ఎదురు దెబ్బలతో అయోమయంలో పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఇప్పటికే 39 స్థానాలలో మాత్రమే బిఆర్ఎస్ విజయం సాధించింది  కొంతమంది ఎమ్మెల్యేలు ఇప్పటికే హస్తం గూటికి చేరుకున్నారు. ఇక రానున్న రోజుల్లో ఎంతమంది కాంగ్రెస్లోకి వెళ్లబోతున్నారు అన్నది హాట్ టాపిక్ గా మారిపోయింది. అయితే ఇప్పుడు బిఆర్ఎస్ పార్టీని కలవరపెట్టే మరో న్యూస్ వైరల్ గా మారిపోయింది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి మినహా మిగతా ఆరుగురు మాజీ ఎమ్మెల్యేలు కీలక నేతలతో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారంటూ ప్రచారం తెలంగాణ రాజకీయాలలో ఊపందుకుంది.


 లోక్సభ ఎన్నికల ఫలితాలు అనంతరం మూకుమ్మడిగా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుపోతున్నారట. అసెంబ్లీ ఎన్నికలలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో 12 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ 11 స్థానాలను కైవసం చేసుకుంది. ఇక భువనగిరి, నల్గొండ ఎంపీ సీట్లు కూడా భారీ మెజారిటీ గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తుంది. ఒకవేళ ఈ రెండు ఎంపీ స్థానాలు కాంగ్రెస్ గెలిచిందంటే దాదాపు బిఆర్ఎస్ ఉమ్మడి నల్గొండ జిల్లాలో కనమరుగు అయ్యే అవకాశం ఉందని పొలిటికల్ సర్కిల్లో చర్చ జరుగుతుంది. ఇప్పటికే ఇలా కాంగ్రెస్లో చేరిక కోసం సంప్రదింపులు కూడా పూర్తయ్యాయట. హస్తం పార్టీ సీనియర్లతో ఇక బిఆర్ఎస్ పార్టీలోని మాజీ ఎమ్మెల్యేలు కీలక నేతలందరూ కూడా రహస్య మంతనాలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. అయితే లోకల్ ఎన్నికలకు  దృష్టిలో పెట్టుకొని ఉమ్మడి నల్గొండ జిల్లాలోని కాంగ్రెస్ బడానేత ఒకరు తెరవెనక చక్రం తిప్పుతున్నట్లు తెలుస్తోంది. బిఆర్ఎస్ను వీక్ చేసి లోకల్ ఎన్నికల్లో కూడా గులాబీ పార్టీని దెబ్బ కొట్టాలని ఆ సీనియర్ నేత అనుకుంటున్నాడట. ఏం జరగబోతుందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: