చంద్ర‌గిరి నియోజ‌క‌వ‌ర్గంలో ఓ కీలక పార్టీకి చెందిన‌ కొంద‌రు కార్య‌క‌ర్త‌లు ఇంటింటికీ వెళ్తున్నారు. చూచా యగా ఓట‌ర్ల‌తో మాట‌లు క‌లుపుతున్నారు. `అక్కా.. అన్న‌కే ఓటేశావా?` `బాబాయ్‌..మ‌న‌కే వేశావుగా` `అన్నా.. చివ‌రి నిముషంలో మ‌న‌సు మార‌లేదుగా` అంటూ.. ఓట‌ర్ల‌ను ప్ర‌శ్నిస్తున్నారు. వారి నుంచి స‌మాచారం తెలుసుకుంటున్నారు. లెక్క‌లు వేసుకుంటున్నారు. క‌ట్ చేస్తే.. విజ‌య‌వాడ ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గంలో ఓ జాతీయ పార్టీ కార్య‌కర్త‌లు ఇంటింటికీ తిరుగుతున్నారు.


సేమ్ టు సేమ్ ఇవే ప్ర‌శ్న‌లు. ఇవే ఆరాలు. అవే న‌మోదులు. ఇక‌, గుంటూరు పార్ల‌మెంటు ప‌రిధిలో అయితే.. ఓట‌ర్ల‌కు పోన్లు వ‌స్తున్నాయి. ఇక్క‌డ ఓపెన్ అయిపోతున్నార‌ట‌. ఇంతిచ్చాం.. మీరు ఏ పార్టీకి ఓటేశార‌ని ప్ర‌శ్నిస్తున్నారు. అయితే.. నాయ‌కుల‌కంటే కూడా.. తెలివి ఎక్కువ‌గా ఉన్న ఓట‌ర్లు.. ఎవ‌రు ఫోన్ చేసినా.. ఎవ‌రు త‌మ ఇంటికి వెళ్లినా.. మీకే వేశం.. అని స‌మాధానం చెబుతున్నారు. దీంతో పార్టీల నాయ‌కుల‌కు లెక్క‌లు తేల‌డం లేదు.


ఎన్నిక‌ల పోలింగ్ ప్ర‌క్రియలో అన్ని పార్టీల ప్ర‌ధాన నాయ‌కులు కూడాడ‌బ్బులు పంచారు. వారు వీరు అనే తేడా లేకుండా.. ప్ర‌తి ఇంటికీ లెక్క పెట్టి మ‌రీ.. డ‌బ్బులు పంచారు. అయితే.. డ‌బ్బులు తీసుకున్న‌వారు.. త‌మ‌కే ఓటేశారా?  లేదా? అనే సందేహం నాయ‌కుల‌ను చుట్టు ముట్టింది. దీంతో చంద్ర‌గిరిలో ప్రారంభ మైన ఈ స‌ర్వే.. ఇప్పుడు 12 నియోజ‌క‌వ‌ర్గాల‌కు పాకింది. దీనిలో గ‌న్న‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గం కూడా ఉంది. కార్య‌క‌ర్త‌లు ప్ర‌తి ఇంటికీ వ‌స్తున్నారు.


అన్న‌కే వేశారా? అని ప్ర‌శ్నిస్తున్నారు. అయితే.. ఇక్క‌డ ఓట‌ర్ల‌ను బెదిరించ‌డ‌మో.. లేక మేం డ‌బ్బులు ఇచ్చాం.. మాకు ఎందుకు వేయ‌లేద‌ని నిల‌దీసేందుకో వారు అలా చేయ‌డం లేదు. ఫైట్ ట‌ఫ్‌గా ఉన్న నేప‌థ్యంలో ఎవ‌రు గెలుస్తార‌నే అంచ‌నా వేసుకునేందుకు మాత్ర‌మే నాయ‌కుల ఈ స‌ర్వేలు చేయిస్తున్నా రు. ఓట‌ర్లు చెప్పిన వివ‌రాల ప్ర‌కారం.. త‌మ త‌మ గెలుపు, ఓట‌ముల‌పై అంచ‌నాలు వేసుకుంటున్నార‌ట‌. మొత్తానికి చేతులు త‌డిపినా.. ఓట్లు రాలాయా?  లేదా? అన్న‌ది నాయ‌కుల‌ను ప‌ట్టి పీడిస్తుండ‌డం గ‌మ‌నార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: