టిడిపి ప్రభుత్వం కేవలం కుట్రపూరితంగానే ఆరోపణలు చేస్తోందంటు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలియజేస్తున్నారు.. లోకేష్ ట్విట్టర్లో తమ పైన తప్పుడు పోస్టులు పెడుతున్నారని నారా లోకేష్ వంటి మూర్ఖులు బుద్ధి తక్కువ మనుషులు ఎక్కడ ఉండారని అందుకే తనని పప్పు లోకేష్ అని పిలుస్తూ ఉంటారని తెలియజేశారు.. దేవినేని ఉమ ఐదేళ్లపాటు ఇరిగేషన్ మంత్రిగా కూడా పనిచేశారు.. చివరికి సీటు కూడ తెచ్చుకోలేకపోయావు.. 2013 నుంచి ఆఫ్రికాలో మేము వ్యాపారం చేస్తున్నాము అక్కడి నుంచి వాహనాలు , మిషనరీ అన్ని పంపిస్తున్నాము బొంబాయి పోర్టు నుంచే వెళుతున్నాయి.. ఫెరో మాంగనీస్, సిలికాన్ మైనింగ్ ప్రాజెక్టులు విదేశాలకు పంపిస్తున్నాము దీంతో త్వరలోనే విదేశాలకు పారిపోతున్నామంటూ తమపైన తప్పుడు ఆరోపణలు చేస్తున్నారంటూ పెద్దిరెడ్డి తెలియజేశారు.


వైసిపి నాయకులు ఇతర దేశాలకు పారిపోతున్నారని పచ్చపత్రికలు కూడా చాలా తమ్ముడుగా ప్రచారం చేస్తున్నాయని ఫైర్ అయ్యారు పెద్దిరెడ్డి.. ఐదేళ్లు నువ్వు మంత్రిగా చేసింది ఏమిటి సీట్లు తెచ్చుకోలేను నువ్వు మాట్లాడుతావా అంటూ లోకేష్ పైన ఫైర్ అయ్యారు. బిజెపి నాయకురాలకు హైదరాబాదులో ఓటు ఉంది. చంద్రబాబుకు హైదరాబాదులో ఓటు పెట్టుకుని ఇక్కడ రాజకీయం చేస్తున్నారని తాను విద్యార్థి దశ నుంచే ఇక్కడ యూనియన్ నాయకుడిగా ఉన్నానని ఫైర్ అయ్యారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.


వచ్చే నెల నాలుగవ తేదీన ఎన్నికల ఫలితాల తర్వాత మీరు ఎక్కడ ముఖాలు పెట్టుకుంటారు అంటూ ఫైర్ అయ్యారు.. మేము చేసిన సంక్షేమాల వల్ల పోలింగ్ రేటు కూడా పెరిగిందని.. నాలుగవ తేదీన రిజల్ట్ విషయం పైన మాట్లాడదామని .. దేవినేని ఉమ ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఉంటూ కొన్ని వేల కోట్లు దోచుకున్నావు నువ్వు పోలింగ్ శాతం పెరగడానికి ముఖ్య కారణం మహిళలే అంటూ తెలిపారు. అందరి కృషి వల్లే మేము ఎక్కువగా సీట్లు విజయాన్ని అందుకుంటున్నామంటు తెలియజేశారు. చంద్రబాబు నాయుడు వల్లే ఎక్కువగా ఘర్షణలు జరుగుతున్నాయని కూడా ఫైర్ అయ్యారు పెద్దిరెడ్డి.

మరింత సమాచారం తెలుసుకోండి: