భారతీయ సినీ ఇండస్ట్రీ 2023లో బ్లాక్ బస్టర్ హిట్స్‌తో కళకళలాడింది. గతేడాదితో పోలిస్తే అంత కాకపోయినా ప్రస్తుత 2024లోనూ చాలా సినిమాలు రూ.100 కోట్ల క్లబ్‌లో చేరాయి. కేవలం బాలీవుడ్ సినిమాలే కాకుండా రీజనల్ ఇండస్ట్రీలలో సైతం కంటెంట్ ఉన్న సినిమాలు చక్కటి విజయాన్ని అందుకున్నాయి. బాలీవుడ్‌లో 'ఫైటర్' నుంచి 'బడే మియాన్ ఛోటే మియాన్' వరకు ఇప్పటివరకు రూ.100 కోట్ల కలెక్షన్ల మార్కును ఆరు సినిమాలు దాటాయి. సౌత్‌లోనూ కొన్ని సినిమాలు రూ.100 కోట్ల కలెక్షన్లను అందుకున్నాయి. వాటిని పరిశీలిస్తే దీపికా పదుకొనే, హృతిక్ రోషన్, అనిల్ కపూర్ ప్రధాన పాత్రల్లో నటించిన 'ఫైటర్' జనవరి 25న థియేటర్లలో విడుదలైంది. ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్ల క్లబ్‌లో చేరిన తొలి సినిమా ఇదే. 351.75 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. 

ఇండియాలో రూ.250.75 కోట్లు, ఓవర్సీస్‌లో రూ.101 కోట్లు వసూలు చేసింది. ఆ తర్వాత షాహిద్ కపూర్, కృతి సనన్ నటించిన 'తేరీ బాటన్ మే ఐసా ఉల్జా జియా' భారత్‌తో పాటు విదేశాలలో మంచి ప్రదర్శన ఇచ్చింది. ఇండియాలో రూ.102.66 కోట్ల గ్రాస్ వసూలు చేయగా, ఓవర్సీస్ మార్కెట్‌లో రూ.41 కోట్ల గ్రాస్ బిజినెస్ చేసింది. టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్ రూ.143.66 కోట్లు. ఈ చిత్రం 9 ఫిబ్రవరి 2024న విడుదలైంది. ఇదే కోవలో ఫిబ్రవరి 23న విడుదలైన యామీ గౌతమ్‌ ప్రధాన పాత్రలో నటించిన 'ఆర్టికల్‌ 370' బాక్సాఫీస్‌ వద్ద ఆశ్చర్యకరంగా మంచి ప్రదర్శన కనబరిచింది. ప్రపంచవ్యాప్తంగా రూ.108.60 కోట్లు వసూలు చేసింది. దీంతో పాటు అజయ్ దేవగన్, ఆర్ మాధవన్, జ్యోతిక నటించిన హర్రర్ డ్రామా 'షైతాన్' కూడా ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద మంచి ప్రదర్శన ఇచ్చింది. ఈ సినిమా దేశీయ మార్కెట్‌లో రూ.177 కోట్లు వసూలు చేయగా, ఓవర్సీస్‌లో రూ.38 కోట్లు రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా టోటల్ కలెక్షన్ రూ.215 కోట్లు.

మార్చి 8న థియేటర్లలో విడుదలైంది. మహిళా ఆధారిత చిత్రం 'క్రూ' ప్రపంచ వ్యాప్తంగా రూ.145.56 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. 'క్రూ'లో కరీనా కపూర్ ఖాన్, టబు మరియు కృతి సనో ప్రధాన పాత్రలు పోషించారు. ఏప్రిల్ 10న విడుదలైన అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ నటించిన 'బడే మియాన్ ఛోటే మియాన్' చిత్రం ప్రతికూల సమీక్షలను అందుకుంది. అయితే గ్లోబల్ కలెక్షన్స్ రూ.110 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ కాగా, దేశీయ మార్కెట్ నుంచి రూ.76.93 కోట్ల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి. ఇక సౌత్ విషయానికొస్తే టాలీవుడ్‌లో టిల్లు స్క్వేర్, హనుమాన్, గుంటూరు కారం సినిమాలు రూ.100 కోట్ల మార్క్‌ను అందుకున్నాయి. తమిళంలో కెప్టెన్ మిల్లర్, అయలాన్ రూ.100 కోట్ల కలెక్షన్లకు దగ్గరలో ఉన్నాయి. మలయాళ సినిమాల్లో దాదాపు అన్ని సినిమాలు బ్లాక్ బస్టర్లుగా నిలిచాయి. మంజుమ్మల్ బాయ్స్, ప్రేమలు, ది గోట్ లైఫ్, ఆవేశం వంటి సినిమాలు బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపించాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: