( గోదావ‌రి - ఇండియా హెరాల్డ్ )

కూట‌మి ప్ర‌భుత్వంలోనే గౌడ‌, గౌడ ఉప‌కులాల నేత‌ల‌కు నిజ‌మైన ప‌వ‌ర్ చేతికి వ‌స్తుంద‌ని టీడీపీ అధికార ప్ర‌తినిధి దాస‌రి శ్యామ చంద్ర శేషు అన్నారు. గౌడ కులాలు, ఉప కులాల‌కు నిజ‌మైన ప‌వ‌ర్ అనే అంశంపై ఆయ‌న ఇండియా హెరాల్డ్ ప్ర‌త్యేక ప్ర‌తినిధితో మాట్లాడారు. గ‌తంలో టీడీపీ అధికారంలో టెడ్డీడేప‌ర్స్ కార్పొరేష‌న్ తీసుకువ‌చ్చి తాతా జ‌య‌ప్ర‌కాష్‌ను చైర్మ‌న్ చేసి గ్రూప్ లోన్లు ఇచ్చేందుకు కోట్లాది రూపాయ‌ల బ‌డ్జెట్ కేటాయించి గౌడ కులాలు ఆర్థికంగా మ‌రింత ముందుకు వెళ్లేలా చేసింద‌న్నారు.


ఈ సారి ఎన్నిక‌ల మెనిఫెస్టోలో కూడా కార్పోరేష‌న్ పున‌రుద్ధ‌ర‌ణ‌తో పాటు మెనిఫెస్టోలో వైన్ షాపుల్లో 10 క‌ల్లు గీత కార్మికుల‌కే ఇస్తామంటూ హామీ ఇవ్వ‌డం చాలా హైలెట్ అంశ‌మ‌ని శేషు తెలిపారు. గౌడ ఉప కులాలు అన్నింటికి సీట్లు ఇచ్చిన ఘ‌న‌త టీడీపీ అధినేత చంద్ర‌బాబుకే ద‌క్కింద‌ని.. గౌడ‌ల‌తో పాటు ఉప కులాలు అంద‌రికి సీట్లు ఇచ్చి న్యాయం చేసిన విష‌యాన్ని ఈ కులాలు ఎప్ప‌ట‌కీ మ‌ర్చిపోలేవ‌ని కూడా శేషు చెప్పారు.


ఇక శెట్టిబ‌లిజ క‌మ్యూనిటి నుంచి మాజీ మంత్రి పితాని స‌త్య‌నారాయ‌ణ‌తో పాటు రెడ్డి సుబ్ర‌హ్మ‌ణ్యంకు కూడా పార్టీకి గుండెకాయ లాంటి పోలిట్‌బ్యూరోలో అవ‌కాశం ఇచ్చార‌న్నారు. గౌడ‌, ఈడిగ‌, శ్రీ శాయ‌న‌, శెట్టిబ‌లిజ‌, లింగాయ‌త్ ఇలా గౌడ‌, ఉప‌కులాలు అంద‌రికి చ‌ట్ట‌స‌భ‌ల‌కు పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన చ‌రిత్ర ఏపీ, తెలంగాణ‌లోనే ఏ రాజ‌కీయ పార్టీకి లేద‌ని.. అది ఒక్క టీడీపీకే సాధ్య‌మైంద‌న్నారు. గ‌త ప్ర‌భుత్వంలోనూ పితాని, కేఈ కృష్ణ‌మూర్తికి మంత్రి ప‌ద‌వులు ఇచ్చిన విష‌యాన్ని కూడా ఆయ‌న గుర్తు చేశారు.


అతి సామాన్య కుటుంబానికి చెందిన త‌న‌కు ఏయూ వ‌ర్సిటీ విద్యార్థి విభాగం అధ్య‌క్ష ప‌ద‌వి ఇవ్వ‌డంతో పాటు అన‌తి కాలంలో పార్టీ రాష్ట్ర కార్య‌ద‌ర్శి ప‌ద‌వి నుంచి అధికార ప్ర‌తినిధి వ‌ర‌కు ప్ర‌మోష‌న్ క‌ల్పించ‌డం చూస్తే గౌడ కులాల్లో వెన‌క‌బ‌డిన వారికి పార్టీ ఎలాంటి అవ‌కాశాలు ఇస్తుందో చెప్పేందుకు ఇదే నిద‌ర్శ‌నం అని తెలిపారు. కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే ఈ కులాల‌కు చెందిన వారికి నామినేటెడ్‌, ఎమ్మెల్సీ ప‌ద‌వుల్లో తిరుగులేని ప్రాధాన్య‌త ఉంటుంద‌ని కూడా చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: