ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు ముగిశాయి. జూన్ 4న విడుదల అయ్యే ఫలితాల కోసం అంతా నిరీక్షిస్తున్నారు. ఎన్నికలు ముగిసినా ప్రత్యర్థులపై ఎవరికి వారు ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నారు. రాజకీయంగా తమ ప్రత్యర్థులను దెబ్బ కొట్టేందుకు యత్నిస్తున్నారు. ఈ క్రమంలో గాజువాక నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన పల్లా శ్రీనివాసరావుకు ఊహించని షాక్ తగిలింది. ఆయన భార్య లావణ్య దేవి విద్యావంతురాలు. ఆమె ఆంధ్రా యూనివర్సిటీ ఇంజినీరింగ్ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. అయితే ఎన్నికల్లో ఆమె భర్త తరుపున ప్రచారం చేసినట్లు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీంతో ఆమెపై పలువురు ఎన్నికల అధికారులకు ఫిర్యాదులు చేశారు. ఎన్నికల సంఘం నుంచి వచ్చిన ఫిర్యాదులతో ఏయూ ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. ఆమెను సస్పెండ్ చేస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. అయితే భర్త తరుపున ఆమె ప్రచారం చేయడమే నేరమా అని పలువురిలో సందేహం వస్తోంది. ప్రభుత్వ ఉద్యోగులు రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొనకూడదనే నిబంధనలు ఉన్నాయి. దీంతో ఆమెను ఏయూ రిజిస్ట్రార్ సస్పెండ్ చేశారు. ఈ పరిణామం రాజకీయ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్న ఇతర ఉద్యోగుల్లో భయం నింపింది. దీనికి సంబంధించిన ఆసక్తికర విషయాలిలా ఉన్నాయి.

గాజువాక నుంచి టీడీపీ అభ్యర్థిగా పల్లా శ్రీనివాసరావు పోటీ చేశారు. ప్రస్తుతం కూటమి నుంచి ఆయన పోటీ చేస్తుండడంతో విజయం ఖాయమనే ధీమాలో ఆయన వర్గీయులు ఉన్నారు. ఇక భర్త పోటీలో ఉండడంతో ఆయన భార్య లావణ్య దేవి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నట్లు తెలుస్తోంది. మే 4న భర్త తరుపున ఆమె ప్రచారం చేసి, టీడీపీ గుర్తు సైకిల్‌కు ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను ఆమె కోరారు. దీంతో ఆమెపై ప్రత్యర్థి పార్టీలకు చెందిన నాయకులు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. దీంతో ఆమె ఎన్నికల సంఘం అధికారులకు వివరణ ఇచ్చారు. తాను కేవలం ఓ మహిళను కలిశానని ఆమె బదులిచ్చారు. ఈ వివరణకు ఎన్నికల సంఘం అధికారులు సంతృప్తి చెందలేదు. ఆమె ప్రభుత్వ ఉద్యోగి కావడంతో చర్యలకు సిద్ధమయ్యారు. ఏయూ రిజిస్ట్రార్‌కు ఎన్నికల రిటర్నింగ్ అధికారి లేఖ రాశారు. ఆమె తన భర్త తరుపున ప్రచారంలో పాల్గొన్నట్లు తేలడంతో ఏయూ రిజిస్ట్రార్ లావణ్య దేవిని సస్పెండ్ చేశారు. చాలా మంది ప్రభుత్వ ఉద్యోగులు బహిరంగంగా కొన్ని పార్టీలకు అనుకూలంగా ఉంటున్న విషయం తెలిసిందే. అయితే సొంత భర్త తరుపున పాల్గొన్నా నిబంధనలు ఉల్లంఘించినట్లే. దీంతో లావణ్య దేవికి అధికారులు షాక్ ఇచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: