తెలంగాణలో ఎంతో ఉత్కంఠకు తెరలేపిన పార్లమెంట్ ఎలక్షన్స్ మే 13వ తేదీన ముగిసాయి అన్న విషయం తెలిసిందే. జూన్ 4వ తేదీన ఫలితాలు వెలవడపోతున్నాయ్. అయితే ఈసారి పార్లమెంట్ ఎలక్షన్స్ లో ఏ పార్టీకి మెజారిటీ రాబోతుంది అన్నది ఆసక్తికరంగా మారిపోయింది. అయితే అటు కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ స్థానంగా ఉన్న మల్కాజ్గిరి లో ఈసారి విజయం ఎవరిని వరించబోతుంది అనే విషయంపై కూడా ఎంతో ఆసక్తి నెలకొంది అన్న విషయం తెలిసిందే.


 ప్రస్తుతం తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్న సీఎం రేవంత్ రెడ్డికి అటు మల్కాజ్గిరి సిట్టింగ్ స్థానం కావడం గమనార్హం.ఈ క్రమంలోనే ఇక్కడ విజయాన్ని కాంగ్రెస్ పార్టీ ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అయితే ఇప్పటికే ప్రతిపక్ష హోదాలోకి రాగానే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న గులాబీ పార్టీ ఇక మళ్ళీ తెలంగాణ రాజకీయాలపై పట్టు సాధించడానికి మినీ ఇండియా గా పిలుచుకునే మల్కాజ్గిరిలో విజయం కోసం పట్టుదలగా పోరాడింది. బిఆర్ఎస్ నుంచి రాగిడి లక్ష్మారెడ్డి, కాంగ్రెస్ నుంచి పట్నం సునీత మహేందర్ రెడ్డి పోటీ చేశారు. బిజెపి నుంచి ఈటెల రాజేందర్ బరిలోకి దిగారు. అయితే ఇక ఈ పార్లమెంట్ సెగ్మెంట్లో ఈ విజయం ఎవరిని వరించబోతుంది అనే విషయం పై ఉత్కంఠ నెలకొంది. కాంగ్రెస్ నేత గోనె  ప్రకాష్ రావు ఇచ్చిన రివ్యూ కాస్త చంచలనంగా మారిపోయింది. ఇక్కడ ఈటెల రాజేందర్ భారీ మెజారిటీతో గెలవబోతున్నాడని.. ఇతర పార్టీల నుంచి ఆయనకు సరైన పోటీ కూడా లేకుండా పోయింది అంటూ రివ్యూ ఇచ్చారు. అంతేకాదు తెలంగాణలో కూడా అధికారంలో ఉన్న కాంగ్రెస్ కంటే అటు బిజెపిని ఎక్కువ మెజారిటీ స్థానాలలో విజయం సాధిస్తుంది అంటూ  ఆయన ఇచ్చిన రివ్యూ కాస్త సంచలనంగా మారిపోయింది. అయితే ఇక ఇప్పుడు ఆయన ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికీ దిగ్గజ విశ్లేషకుడిగా పేరు సంపాదించుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: