ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ పార్టీలు అంటే అందరికీ గుర్తుకు వచ్చేది  సైకిల్ పార్టీయే.  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇప్పటికీ ఎంతో మంది అభిమానులు టిడిపికి ఉన్నారు. అలాంటి టిడిపి  పార్టీ ఆవిర్భావం నుంచి  ఇప్పటివరకు ఎన్నో అభివృద్ధి పనులు తీసుకువచ్చింది. సీనియర్ ఎన్టీఆర్ మరణం తర్వాత పూర్తిస్థాయిలో టిడిపికి చంద్రబాబు బాస్ అయ్యారు. ఆయన హయాంలో కూడా పలుమార్లు టిడిపి అధికారంలోకి వచ్చింది. ఎప్పుడైతే రాజశేఖర్ రెడ్డి మరణించారో ఇక అప్పటినుంచి టిడిపికి ఏపీలో వ్యతిరేక పార్టీ ఏర్పడింది. రాజశేఖర్ రెడ్డి కొడుకు జగన్ వైసిపి పేరుతో కొత్త పార్టీ పెట్టి టిడిపిని కొద్దికొద్దిగా వెనక్కి నెట్టే ప్రయత్నం చేస్తూ వచ్చారు. 2019లో పూర్తిగా టిడిపిని ఓడించి అత్యధిక మెజారిటీతో  ఆయన అధికారం చేజిక్కించుకున్నారు. అంతేకాదు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొచ్చి ప్రజల మనసులో చిరస్థాయిగా నిలిచారు అని చెప్పవచ్చు. 

అలాంటి తెలుగుదేశం పార్టీ ఈ ఎన్నికల్లో పూర్తిగా చతికిల పడ్డట్టు తెలుస్తోంది. ఎన్ని ఉచిత పథకాలు ప్రకటించినా ప్రజలు నమ్మలేదనే ఒక ఆరోపణ వినిపిస్తోంది. ఈ ఎలక్షన్స్ లో తప్పకుండా  మేమే గెలుస్తామని జగన్ బాహాటంగానే చెబుతున్నారు.  కానీ చంద్రబాబు ఈ విషయాన్ని ఎక్కడా కూడా చెప్పలేకపోతున్నారు. అంతేకాదు ఈసారి టిడిపికి  గ్రామీణ ఓటర్లు గట్టిగా దెబ్బ కొట్టినట్టు తెలుస్తోంది. జనసేన, బిజెపి పొత్తుతో ఎక్కువ ఓట్ షేరింగ్ అవుతుందని భావించిన చంద్రబాబుకు  తప్పక షాక్ తగులుతుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. కట్ చేస్తే తెలంగాణలోని కొల్లాపూర్ నియోజకవర్గంలో బర్రెలక్క పోటీ చేసింది. ఇదే తరుణంలో బర్రెలక్కకు విపరీతమైన ఫాలోయింగ్ పెరిగింది. చాలామంది ఆమె కి సపోర్ట్ గా నిలిచారు. బర్రెలక్క గెలుస్తుంది అని కూడా అన్నారు. చివరికి చూసేసరికి ఈమెకు కేవలం 5000 ఓట్లు మాత్రమే పడ్డాయి. ఈ విధంగా సోషల్ మీడియా లోనే బర్రెలక్క హైలైట్ అయింది తప్ప ఓట్లు రాబట్టే విషయంలో వెనుకబడిపోయింది.

ఆ విధంగానే ఏపీలో కూడా చంద్రబాబు సోషల్ మీడియాలో  హైలైట్ అయ్యారు తప్ప, ప్రజల ఓట్లు రాబట్టే  విషయంలో జగన్ కే సపోర్ట్ చేసినట్టు తెలుస్తోంది. జగన్ అన్ని పథకాలు అమలు చేస్తుంటే, చంద్రబాబు రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తున్నారు.మనం ఇబ్బందుల్లో పడబోతున్నామంటూ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం చంద్రబాబు  జగన్ కు మించి  హామీలు ఇచ్చారు. ఒకవేళ చంద్రబాబు అధికారంలోకి వస్తే  అవి ఎలా నెరవేరుస్తారనే ఆలోచన కూడా ప్రజల్లో నెలకొంది. జగన్ తీసుకొచ్చిన ఆ పథకాలు నెరవేరనప్పుడు ఈ పథకాలు ఎలా  అమలవుతాయని ఆలోచించి మళ్లీ జగన్ కు వత్తాసు పలికినట్టు తెలుస్తోంది. అంతేకాకుండా రూరల్ ఓట్లు మొత్తం జగన్ వైపే మల్లాయి. నిరుద్యోగులు, ఉద్యోగులు,  ఎగువ మధ్య తరగతి వారే టిడిపికి ఓటు వేసినట్టు తెలుస్తోంది. ఇక మధ్యతరగతి పేద ప్రజలు, స్లమ్ముల్లో ఉండే ప్రజలు,  వృద్ధులు  అంతా వైసిపికే ఓటు వేసినట్టు తెలుస్తోంది. అందుకే జగన్ 151 కంటే ఎక్కువ అసెంబ్లీ సీట్లు గెలుస్తామని,  22 పార్లమెంటు స్థానాల్లో గెలవబోతున్నామని గట్టిగానే చెప్పారు. ఈ తరుణంలో ఎవరి భవితవ్యం ఏంటనేది బయటపడాలి అంటే జూన్ 4 వరకు వెయిట్ చేయాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: