ఏపీ ఎలక్షన్స్ ముగిసిపోయాయి. అభ్యర్థుల భవితవ్యం మొత్తం ఈవీఎంలలో నిక్షిప్తమై ఉంది. జూన్ 4న ఎవరి భవిష్యత్తు ఏంటి అనేది బయటపడబోతోంది. ఇదే తరుణంలో అనేక సర్వేలు, ఎగ్జిట్ పోల్స్ వస్తున్నాయి. ఇందులో ఎక్కువ సర్వేలు టిడిపి గెలుస్తుందని చెబుతుంటే, మరికొన్ని సర్వేలు వైసిపికి ఫేవర్ గా ఉందని చెబుతున్నాయి.  ఈ ఉత్కంఠకు తెరపడాలి అంటే ఇంకా 12 రోజులు వెయిట్ చేయాల్సిందే. ఇప్పటికే నేతలంతా ఎవరు ఏ వైపు ఓట్లు వేశారు  అనేది తీవ్రంగా సెర్చ్ చేస్తున్నారు. కానీ ఓట్లు వేసిన తర్వాత చేసిన సర్వేల ప్రకారం జగన్ గెలుస్తాడని అంటున్నారు. 

అంతే కాదు జగన్ కూడా  తప్పక 151 అసెంబ్లీ సీట్ల కంటే ఎక్కువ గెలుస్తామని 22 పార్లమెంటు స్థానాల్లో విజయం సాధిస్తామని గట్టిగా చెప్పారు. కానీ విజయంపై ఇప్పటికి టిడిపి మౌనం గానే ఉంది. ఇదే తరుణంలో  రకరకాల జ్యోతిష్యాలు కూడా చెబుతున్నారు. జ్యోతిష్యంలో మంచి పేరుగాంచినటువంటి వేణు స్వామి  ప్రస్తుతం ఎవరు గెలుస్తారనే దానిపై ఆసక్తికరమైన కామెంట్లు చేశారు. ఆయన ఎన్నికలకు ముందే జగన్ గెలుస్తారని చెప్పారు. ప్రస్తుతం ఎన్నికలు జరిగిన తర్వాత కూడా ఆయన జగనే సీఎం కాబోతున్నారని బాహాటంగానే చెబుతున్నారు. జగన్ గెలవడానికి డైరెక్ట్ గా కారణం చంద్రబాబు అని కూడా అంటున్నారు.

చంద్రబాబు కూటమిగా ఏర్పడక ముందు ఎవరిని అడిగినా టిడిపి విజయం సాధిస్తుందని చెప్పారు. ఎప్పుడైతే కూటమిగా ఏర్పడ్డాడో ఆ వేవ్ కాస్త జగన్ వైపు మళ్ళీంది. ఇలా ఇండైరెక్టుగా చంద్రబాబు జగన్ ని గెలిపించడంలో ప్రధాన పాత్ర పోషించారని చెప్పవచ్చు. ఇదే ప్రధాన అస్త్రంగా మలుచుకున్న  జగన్ మాత్రం తన గెలుపును గట్టిగా చెబుతూ ప్రజల్లోకి తాను చేసిన అభివృద్ధిని మొత్తం తీసుకెళ్లారు. ఈ విధంగా సింగిల్ గానే కొట్లాడి  మరోసారి అధికారంలోకి వస్తానని చెబుతున్నారు. ఈ క్రమంలోనే వేణు స్వామి కూడా జగన్ సీఎం అవుతారని, ఆయన ముఖ్యమంత్రి పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత అనేక ఇబ్బందులు ఎదుర్కుంటారని అంటున్నారు.  మరి చూడాలి ఈయన చెప్పిన మాటలు నిజమవుతాయా, అబద్ధం అవుతాయా అనేది ముందు ముందు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: