- ఉంగుటూరులో జ‌న‌సేన ధ‌ర్మ‌రాజు విక్ట‌రీ ప‌క్కా..!
- టీడీపీ స‌పోర్ట్ + క్లీన్ ఇమేజ్‌తో గాజు గ్లాసు గెలుపు..?
- జ‌న‌సేన నుంచి బ‌రిలో ఉన్న ఏకైక రాజు ..!

( గోదావ‌రి - ఇండియా హెరాల్డ్ )

ఆంధ్రప్రదేశ్లో ఈ ఎన్నికలలో జనసేన పార్టీ తెలుగుదేశం, బిజెపితో పొత్తు పెట్టుకుని మొత్తం 21 స్థానాలలో పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. జనసేన 21 అసెంబ్లీ, రెండు పార్లమెంటు స్థానాలలో పోటీ చేస్తుంది. అయితే ఇందులో ఎక్కువగా కాపు సామాజిక వర్గానికి చెందిన వారే ఉండటం విశేషం. జనసేన పోటీ చేస్తున్న కాకినాడ, మచిలీపట్నం ఎంపీ అభ్యర్థులు ఉదయ్ శ్రీనివాస్, వల్లభనేని బాలశౌరి కాపు నేతలే. అలాగే జనసేన పోటీ చేసే అసెంబ్లీ స్థానాలలో పంచకర్ల రమేష్ బాబు - సుందరపు విజయ్ కుమార్ - పవన్ కళ్యాణ్ - బత్తుల బలరామకృష్ణ - పంతం నానాజీ - కందుల దుర్గేష్ - బొలిశెట్టి శ్రీనివాస్ - పులపర్తి అంజిబాబు - మండలి బుద్ధ ప్రసాద్ ఇలా కాపు నేతలు చాలామంది ఉన్నారు. ఇక రెండు ఎస్టీ.. రెండు ఎస్సీ నియోజకవర్గాల్లోనూ జనసేన పోటీ చేస్తుంది.


ఇది ఇలా ఉంటే జనసేన నుంచి పోటీపడుతున్న నేతలలో క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన ఒకే ఒక నేత ఉన్నారు. ఆయన ఎవరో కాదు ? ఉంగుటూరు నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తున్న పత్స‌మట్ల ధర్మరాజు. 2019 ఎన్నికలలోనే ధర్మరాజు ఉంగుటూరు నుంచి అసెంబ్లీకి పోటీ చేసే ప్ర‌య‌త్నం చేశారు. ఈసారి పొత్తులో భాగంగా జనసేన నుంచి కాస్త యాక్టివ్ గా ఉన్న క్షత్రియ సామాజిక‌ వర్గానికి చెందిన ఏకైక నేత కావడంతో పవన్ కళ్యాణ్ ఉంగుటూరు టికెట్ ఆయనకు కేటాయించారు. జనసేన నుంచి బరిలో ఉన్న ఏకైక క్షత్రియ నేత కావడంతో నియోజకవర్గ పరిధిలో ఉన్న క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన నేతలతో పాటు పవన్ కళ్యాణ్ అభిమానులు.. ఉంగుటూరు నియోజకవర్గంలో బలంగా ఉన్న కాపు నేతలు ఇటు టిడిపి క్యాడర్ గట్టిగా సపోర్ట్ చేసింది.


ప్రచారంలోనూ ధర్మరాజు దూసుకుపోయారు. దీనికి తోడు క్లీన్ ఇమేజ్ ఉండటం కూడా ధర్మరాజుకు బాగా కలిసి వ‌చ్చింది. ఉంగుటూరు టికెట్ ఆశించిన టిడిపి మాజీ ఎమ్మెల్యే ఏలూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు సైతం ధర్మరాజుకు గట్టిగా సపోర్ట్ చేశారు. ఈ క్రమంలోనే ఎన్నికలలో ధర్మరాజు గెలుపు న‌ల్లేరు మీద నడక కానుంది. గోదావరి జిల్లాలో జనసేన + తెలుగుదేశం పార్టీ కాంబినేషన్ సూపర్ సక్సెస్ కావడంతో ఆ ప్రభావం కాపు సామాజిక‌ వర్గం బలంగా ఉన్న ఉంగుటూరులో కూడా గట్టిగా కనిపించింది. ఇక్కడ జనసేన అభిమానులు కూడా ఎక్కువే. దేంతో టిడిపి క్యాడర్ గట్టిగా సపోర్ట్ చేయడంతో జనసేన నుంచి అసెంబ్లీలో అడుగుపెట్టే తొలి క్షత్రియ నేతగా ధర్మరాజు తన పేరు రికార్డుల్లో లిఖించుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: