మహారాష్ట్రలో బిజెపికి ఈ పార్లమెంటు ఎన్నికలలో గట్టి ఎదురుదెబ్బ తగలటం ఖాయం అన్న అంచనాలు.. నివేదికలు వినిపిస్తున్నాయి. అసలు పార్టీలతో కాకుండా నకిలీ పార్టీలతో పొత్తులు పెట్టుకుని బిజెపి ఈ ఎన్నికల్లో పోటీ చేయడంతో బిజెపికి ఉన్న సీట్లకు గండిపడే ప్రమాదం ఉందని పలు ఒపీనియన్ పోల్స్‌ చెబుతున్నాయి. బిజెపికి అత్యంత కీలకమైన రాష్ట్రాలలో మహారాష్ట్ర ఒకటి. గత ఎన్నికలలోను శివసేనతో కలిసి క్లీన్ స్లీప్ చేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. కానీ మారిన రాజకీయ పరిస్థితుల్లో బిజెపి చేసిన ప్రయోగాలు ఆ పార్టీని పూర్తిగా ఇబ్బందుల్లోకి నెట్టేసాయి.


అసలు పార్టీలను చీల్చి నకిలీ పార్టీల ఏర్పాటును ప్రోత్సహించిన బిజెపి వాటినే అసలైన పార్టీలుగా భావిస్తూ పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళ్ళింది. శివసేన పార్టీని నెట్ట నిలువునా  చీల్చ‌డంలో బిజెపి కీలక పాత్ర పోషించింది. షిండే బలం మొత్తం బిజెపి నే. చివరకు శివసేన గుర్తు కూడా లాగేసుకున్నారు. నిజమైన శివసేనను షిండే చేతికి ఇచ్చామని బిజెపి వాళ్లు గొప్పలు చెప్పుకుంటున్నారు. కానీ థాకరే లు లేని శివసేన ఉంటుందా ? అక్కడ ప్రజలు ఊహించగలరా అంటే సాధ్యం కాదని సర్వేలు చెబుతున్నాయి. ఉద్దవ్ థాకరే చేతిలోని శివశేన‌నే మ‌హారాష్ట్ర‌ ప్రజలు అసలైందిగా గుర్తిస్తున్నారు.


అలాగే శరత్ పవర్ పార్టీ ఆయనది కాదని వేరే వారికి అప్పగించారు. కానీ అసలైన ఎన్సిపి శరత్ పవార్‌దే నని ప్రజలు తీర్పు ఇవ్వబోతున్నట్టు సర్వేలు చెబుతున్నాయి. ఈ రాజకీయ ప్రయోగాలలో బిజెపి తీవ్రంగా నష్టపోయే అవకాశాలు కనిపిస్తున్నట్టు తెలుస్తోంది. గతంలో మహారాష్ట్రలో బిజెపి 23 సీట్లు దక్కించుకుంది. ఈసారి అలయన్స్ పార్టీల సంగతి పక్కన పెట్టి తాము ఆస్థానాలు అయినా దక్కించుకుంటామా లేదా అన్న ఆందోళన అయితే వారిలో ఉంది. బిజెపికి గడ్డు పరిస్థితి వస్తే అక్కడ వెనకబడిపోతాం.. మొత్తానికి ఢిల్లీ పెట్టడానికి దూరం జరుగుతాం అన్న ఆందోళనలు కూడా వారిలో కనిపిస్తున్నాయి.


ఏది ఏమైనా రెండు కీలక పార్టీలను నిట్ట నిలువునా చీల్చి చివరకు బిజెపి మహారాష్ట్రలో నిండా మునిగిపోయే పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: