ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో మాచర్ల నియోజకవర్గం హాట్ టాపిక్ అవుతున్న సంగతి తెలిసిందే. పోలీసులు తాజాగా మాచర్లలో హై అలర్ట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. టీడీపీ నేతలు ఈరోజు ఛలో మాచర్లకు పిలుపునివ్వగా ఛలో మాచర్లకు అనుమతులు లేకపోవడంతో జూలకంటి బ్రహ్మారెడ్డితో పాటు మరి కొందరు టీడీపీ నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. మాచర్లలో ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు.
 
మాచర్లలో గతంలో ఎప్పుడూ ఈ తరహా ఘటనలు చోటు చేసుకున్న సందర్భాలు అయితే లేవు. అయితే బ్రహ్మారెడ్డి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన తర్వాత ఈ రచ్చ మాచర్లలో జరిగిందని స్థానిక ప్రజల్లో కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. బ్ర‌హ్మారెడ్డి ఏమైనా సతీ సావిత్రి తమ్ముడా అంటూ మాచర్లకు చెందిన కొంతమంది టీడీపీ వ్యతిరేకులు అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.
 
మరోవైపు పల్నాడులో 144 సెక్షన్ అమలులో ఉన్నా చలో పల్నాడు దిశగా టీడీపీ నేతలు అడుగులు వేయడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చలో పల్నాడుకు అనుమతులు ఇస్తే శాంతి భద్రతల సమస్యలు తలెత్తే ఛాన్స్ అయితే ఉందని తెలుస్తోంది. మాచర్లలో ఎలాగైనా పర్యటనలు చేపడతామని టీడీపీ నేతలు చేస్తున్న కామెంట్లపై పోలీసులు సీరియస్ గా ఉన్నారని సమాచారం అందుతోంది.
 
మరోవైపు జూలకంటి బ్రహ్మారెడ్డి కొన్ని సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. పిన్నెల్లి ఏ తప్పు చేయకుండా ఎందుకు పారిపోయారని ఆయన కామెంట్లు చేస్తున్నారు. పల్నాడులో మొత్తం 74 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీలు గాయపడ్డారని జూలకంటి బ్రహ్మానందరెడ్డి చెబుతున్నారు. పల్నాడు జిల్లాలో హింసపై ముందుగానే అప్రమత్తం చేశామని పిన్నెల్లిపై పోలీసులు ఇప్పటివరకు చర్యలు తీసుకోలేదని బ్రహ్మారెడ్డి చెబుతున్నారు. బ్రహ్మారెడ్డి, పిన్నెల్లి విషయంలో పరస్పర భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఎవరు తప్పు చేశారో ఎవరు రైటో తెలియాలంటే విచారణ పూర్తయ్యే వరకు ఆగాల్సిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: