జూలకంటి బ్రహ్మారెడ్డి అసలు మాచర్లలో తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసేందుకే ఎవరు ? ముందుకు రాని సమయంలో బ్రహ్మ రెడ్డి పోటీ చేయడానికి ముందుకు రావడంతోనే ఆ పార్టీ అభిమానులకు ... ఆ పార్టీ మీడియాకు ఒక పెద్ద హీరో అయిపోయాడు. గత రెండున్నర దశాబ్దాలుగా మాచర్ల నియోజకవర్గం పై పిన్మెల్లి ఫ్యామిలీ పట్టు కొనసాగుతూ వస్తోంది. అసలు ఈ ఫ్యామిలీని ఎదిరించి పోటీ చేసి గెలిచే దమ్ము ఏ టిడిపి నేతకు లేకుండా పోయింది. చివరకు ఇక్క‌డ టీడీపీ ప‌రిస్థితి ఎలా ? మారింది అంటే టిడిపి అధినేత చంద్రబాబు సైతం మాచర్ల నియోజకవర్గం పూర్తిగా ఆశ‌లు వదిలేసుకున్నారు. మాచర్లలో మనం ఎవరిని పోటీకి పెట్టిన గెలవలేం అని చంద్రబాబు ముందే డిసైడ్ అయిపోయి ప్రతి ఎన్నికకు ముందే చేతులు ఎత్తేస్తున్నారు.


అలాగే ప్రతి ఎన్నికకు ఒక నేతను మార్చుకుంటూ వస్తున్నారు. 2004 - 2009 ఎన్నికలలో ఇదే జూలకంటి బ్రహ్మారెడ్డి పోటీ చేసి పిన్మెల్లి ఫ్యామిలీ చేతిలో చావు దెబ్బ తిన్నారు. 1999లో మాత్రం బ్రహ్మారెడ్డి తల్లి దుర్గాంబ‌ టిడిపి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఇక 2014 ఎన్నికలలో కొమ్మారెడ్డి చలమారెడ్డికి సిటు ఇవ్వ గా ఆయన కూడా ఓడిపోయారు. అంతకు ముందు 2012 ఉప‌ ఎన్నికలలో చిరుమామిళ్ల మధుబాబు పోటీ చేసి ఓడిపోయారు. 2019 ఎన్నికలలో అన్నపురెడ్డి అంజిరెడ్డి పోటీ చేసి ఓడిపోయారు. బ్రహ్మారెడ్డి అంటే మిగిలిన వాళ్ళ సంగతి ఎలా ? ఉన్నా తెలుగుదేశం పార్టీ వాళ్లే ఇష్టపడరు.


అసలు చిరుమామిళ్ల మధుబాబు - కొమ్మారెడ్డి చెల‌మా రెడ్డి వర్గాలు బ్రహ్మారెడ్డి నాయకత్వాన్ని మాచర్లలో ఎంత మాత్రం సహించడం లేదు. అయినా సొంత పార్టీ వాళ్లకే ఇష్టం లేకుండా చంద్రబాబు 12 ఏళ్ల పాటు ఖాళీగా ఉండి రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉండి తాను మాచర్లలో రాజకీయం చేయలేను అని చేతులెత్తేసిన బ్రహ్మారెడ్డిని తిరిగి ఇక్కడికి తీసుకువచ్చారని టిడిపి నేతలు వాపోతున్న పరిస్థితి.

మరింత సమాచారం తెలుసుకోండి: