పల్నాడు జిల్లాలోని మాచర్ల నియోజకవర్గం లో 2004 నుంచి ప్రస్తుతం ఎన్నికల దాకా ఎక్కువగా పిన్నెల్లి  కుటుంబం హవా నడుస్తోంది. పిన్నెల్లి లక్ష్మారెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచారు.. ఆయన సోదరుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కూడా ఆ తర్వాత రాజకీయ ఎంట్రీ ఇచ్చారు.. 2009లో కాంగ్రెస్ నుంచి ఆయనకు అవకాశం వచ్చి విజయాన్ని అందుకున్నారు.. 2012లో కూడా రాజకీయ సమీకరణాలలో ఉప ఎన్నికలు రావడంతో అందులో కూడా పిన్నెల్లి నే విజయాన్ని అందుకున్నారు. అలా 2014, 2019 అసెంబ్లీ ఎన్నికలలో వైఎస్ఆర్సిపి పార్టీ నుంచి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గెలిచారు.


అయితే అసెంబ్లీ ఎన్నికల పరిస్థితి ఇలా ఉంటే ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా టిడిపి కనీసం అభ్యర్థులను కూడా నిలబెట్ట లేకపోయింది.. అటు అన్ని ఏకగ్రీవాలు చేయించి తన అనుచరులను పదవుల్లో కూర్చోబెట్టారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి.. ఈ క్రమంలోనే అటు చంద్రబాబు ,లోకేష్ కి కూడా సవాల్ చేయడంతో తెలుగుదేశం పార్టీ మాచర్ల నియోజకవర్గం పై ఫోకస్ పెట్టి పిన్నెల్లికి ధీటు గా పనిచేసే నాయకుడి కోసం అన్వేషించారు.. అందులో భాగంగానే జూలకంటి బ్రహ్మారెడ్డి పేరు తెరపైకి వచ్చింది. ఈయననే మాచర్ల తెలుగుదేశం పార్టీ ఇన్చార్జిగా నియమించారు చంద్రబాబు..  జూలకంటి బ్రహ్మారెడ్డిది కూడా మాచర్ల ప్రాంతమే.. ఆయన తండ్రి నాగిరెడ్డి 1972లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు.. 1999లో నాగిరెడ్డి సతీమణి జూలకంటి దుర్గాంబ టిడిపి అభ్యర్థిగా బరిలో దిగి విజయం సాధించారు.


కానీ 2004,  2009 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా జూలకంటి బ్రహ్మారెడ్డి టిడిపి అభ్యర్థిగా బరిలో నిలిచి ఓటమి పాలవడంతో రాజకీయాలకు దూరం అయ్యారు. ఇక అలా  ఓటమి భయంతో 12 ఏళ్లు రాజకీయాలకు దూరంగా ఉన్న జూలకంటి బ్రహ్మారెడ్డి... ఇప్పుడు మళ్లీ పోటీ చేస్తున్నారు.. అయితే ఈసారి కూడా కష్టంగానే అనిపిస్తోంది. మూడోసారి కూడా ఓటమి భయంతోనే.. ఆయన బరిలోకి దిగినట్టు తెలుస్తోంది. అందుకే ఇక్కడ రిగ్గింగులు, పోలింగ్ బూతుల ఆక్రమణ కు పాల్పడినట్లు పల్నాడు ప్రజానీకం కామెంట్లు చేస్తున్నారు. ముఖ్యంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి హవాను తట్టుకొని రాజకీయం చేయగలిగే సత్తా ఉన్న నాయకుడు జూలకంటి బ్రహ్మారెడ్డి అని టిడిపి నమ్ముతోంది కానీ పల్నాడు ప్రజానీకంలో మాత్రం ఆక్రమాలకు టిడిపి దిగుతోందని వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఎవరు అధికారంలోకి వస్తే భవిష్యత్తు ఎలా ఉంటుంది.. గొడవలు ఏం జరుగుతాయో అనే ఆందోళన పల్నాడు ప్రజానీకంలో ఎక్కువగా వినిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: