సాధారణంగా సెలబ్రెటీలకు, రాజకీయ నేతలకు బెదిరింపు ఫోన్ కాల్స్ వస్తుంటాయి. ఒక్కోసారి నిజంగానే కొంతమంది రాజకీయ వేత్తలను చంపడానికి కుట్రలు పన్నుతుంటారు. "చంపేస్తాం, కావాలంటే తప్పించుకో" అన్నట్లు వార్నింగ్స్‌ ఇస్తుంటారు. తాజాగా ఏకంగా ప్రధాని నరేంద్ర మోదీకే ఇలాంటి భయం కలిగించే ఫోన్‌ కాల్ వచ్చింది. చెన్నైలోని పురశైవాకంలో ఉన్న నేషనల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (ఎన్ఐఏ) ఆఫీస్ కంట్రోల్ రూమ్‌కు ఈ బెదిరింపు కాల్ చేశారు. అది ఎవరనేది ప్రస్తుతానికైతే కచ్చితంగా తెలియ రాలేదు కానీ ఆ గుర్తు తెలియని దుండగుడు "ప్రధాని నరేంద్ర మోదీని చంపేస్తాన"ని హిందీలో బెదిరించాడు. ఈ షాకింగ్ ఫోన్ కాల్ గురించి తాజాగా పోలీసు వర్గాలు వెల్లడించాయి.

కాల్‌ని లిఫ్ట్ చేసిన వెంటనే, నేషనల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అధికారులు అప్రమత్తమయ్యారు. ఆ ఫోన్ కాల్ డీటెయిల్స్ అలాగే బెదిరింపుకు సంబంధించిన వివరాలను చెన్నై పోలీసులకు అందజేశారు. బెదిరించిన  ఈ ఫోన్ నంబర్‌ ఎక్కడినుంచి వచ్చిందో ఎవరు చేశారో త్వరగా కనిపెట్టమని కోరారు. NIA అభ్యర్థన మేరకు వెంటనే చెన్నైలోని సైబర్ క్రైమ్ పోలీసులు దీని గురించి ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టేశారు.

అధికారులు ప్రస్తుతం కాల్ వచ్చిన కచ్చితమైన ప్రాంతాన్ని గుర్తించడానికి శరవేగంగా వర్క్ చేస్తున్నారు. సంఘటనలో ఉపయోగించిన SIM కార్డ్‌లను చాలా యాక్టివ్ గా ట్రేస్ చేస్తున్నారు. వారు ఆ వ్యక్తిని త్వరలోనే పట్టుకుంటామని హామీ ఇస్తున్నారు. ఈ పని ఎవరు చేశారనేది కొన్ని గంటల్లో తెలిసే అవకాశం ఉంది. ప్రస్తుతానికి అయితే ఈ ఫోన్ కాల్ భారతదేశం వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఈ ఫోన్ కాల్ తర్వాత నరేంద్ర మోడీకి భద్రతను పెంచే అవకాశం ఉంది. ఎందుకంటే ఆ ఫోన్ చేసింది చాలా కరుడుగట్టిన మోదీని చంపాలని బాగా ప్లాన్ చేస్తున్న వ్యక్తి కావచ్చు. ఇలాంటి ఫోన్ కాల్స్ అన్ని చాలా సీరియస్ గా తీసుకుంటున్నారు. ఎట్టి పరిస్థితులలో ఎలాంటి వాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు తగిన సెక్యూరిటీ అందించే ఛాన్స్ ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: