రాజకీయాల పరంగా పల్నాడు జిల్లాల్లోని మాచర్ల నియోజకవర్గంలో దాదాపు రెండు దశాబ్దాల నుండి ఇప్పటిదాకా పిన్నెల్లి కుటుంబం హవా కొనసాగుతుంది.2004లో పిన్నెల్లి లక్ష్మారెడ్డి కాంగ్రెస్ తరఫున గెలిచారు. ఆ తర్వాత ఆయన తమ్ముడి కుమారుడు అయినా పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి రాజకీయల్లోకి ఎంట్రీ ఇచ్చారు.2009లో కాంగ్రెస్ నుంచి ఆయనకు అవకాశం వచ్చి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల ఉపఎన్నికల్లో రావడం వల్ల మరలా ఆయనే గెలిచారు.

అప్పటి నుండి ఇప్పటిదాకా పిన్నెల్లి వర్గానికి తిరుగే లేకుండా పోయింది.అయితే ప్రస్తుతం  బ్రహ్మారెడ్డి పేరును చంద్రబాబు తెరపైకి తెచ్చి పిన్నెల్లి కి సరైన వాడు జూలకంటి అని గుర్తించి ఆయన్ను బరిలోకి దించారు. జూలకంటి బ్రహ్మారెడ్డి వ్యక్తిగత పరంగా వస్తే ఆయనది  మాచర్లలోని వెల్దుర్ది గ్రామం.ఆయన తండ్రి జూలకంటి నాగిరెడ్డి 1972లోనే ఇండిపెండెంట్ట్ గా బరిలో నిల్చి గెలుపొందారు.తర్వాత 1999లో నాగిరెడ్డి భార్య అయినా జూలకంటి దుర్గాంబ టీడీపీ అభ్యర్థిగా బరిలో నిలిచి విజయం సాధించారు.ఆమె తరువాత 2004, 2009 అసెంబ్లీ ఎన్నికల్లో బ్రహ్మారెడ్డి టీడీపీ అభ్యర్థిగా బరిలో నిలిచి ఓటమిని ఎదుర్కొన్నారు.అప్పటి నుండి రాజకీయాలకు దూరంగా ఉన్నారు.అయితే ఆయన అప్పటి నుండి రాజకీయాలకు దూరంగా ఉండి అసలు పట్టించుకోలేదు. కానీ పిన్నిల్లిని ఢీ కోట్టే దిశగా చంద్రబాబు ఆయన్ని మళ్ళీ ప్రత్యక్ష రాజకీయాల్లో భాగంగా మరలా బరిలో దించారు.

ప్రస్తుతం పల్నాడు పరిస్థితులపై మాచర్ల టిడిపి అభ్యర్థి బ్రహ్మారెడ్డి హాట్‌ కామెంట్స్ చేశారు. మాచర్లలో ఉద్రిక్త పరిస్థితులకు కొంతమంది పోలీసుల ఫెయిల్యూరే కారనం అని ఎమ్మెల్యే ముందస్తుగా హెచ్చరించి దాడులకు దిగినా, పోలీసులు చూస్తూ ఉండిపోయారని ఆగ్రహించారు.ఏదేమైనా బ్రహ్మారెడ్డి తిరిగి రావడం వల్లే మాచర్ల పరిస్థితి ఉదృతంగా ఉందని అక్కడి ప్రజలు అంటున్నారు.ఇదంతా చూస్తుంటే బ్రహ్మారెడ్డికి మరలా రాజకీయ సన్యాసం తప్పదని తెలుస్తుందని అక్కడి అంతర్గత ప్రజల టాక్.


మరింత సమాచారం తెలుసుకోండి: