గత కొన్ని రోజులనుండి వైసీపీకి చెందిన ప్రముఖ నాయకుడు మాచర్ల అభ్యర్ధి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చుట్టూనే వార్తలు తిరుగుతూ ఉన్నాయి. అవును, ఆయన పొలిటికల్ కెరీర్ ఇక క్లోజ్ అంటూ రకరకాల చర్చలు వాడివేడిగా సాగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఆయన ఆవేశంతో చేసిన చర్యల ఫలితంగా ఆయన రాజకీయ జీవితానికి ఘోరమైన నష్టం వాటిల్లనుందని రూమర్స్ వినబడుతున్నాయి. మరీ ముఖ్యంగా రాజకీయాలకు అనర్హుడు అవుతారా? అన్న అంశం పైనే ఎక్కువగా రచ్చ జరుగుతోంది. పిన్నెల్లి మీద పెట్టిన పదునైన సెక్షన్లే దానికి కారణం.

ఆయన పోలీసులకు దొరికితే మాత్రం బెయిల్ కూడా రావడం కష్టం అని అంటున్నారు. అవును, ఆయన మీద పెట్టిన 10 సెక్షన్లు కూడా చాలా తీవ్రమైనవి. వాటికి కనీసంగా 7 సంవత్సరాలు జైలు శిక్ష తప్పదని అంటున్నారు. అంటే ఆయన దాదాపుగా ఆరేళ్ళ పాటు ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హుడు అని ఇక్కడే తేటతెల్లం అయిపోయింది. ముఖ్యంగా ఏదైనా కేసులలో ఇరుక్కుని జైలు పాలు అయి రెండేళ్ళకు మించి శిక్ష పడితే మాత్రం సదరు వ్యక్తి ఎన్నికల్లో పోటీకి అనర్హుడు అవుతారు అనేది నగ్నసత్యం. మరి పిన్నెల్లి విషయంలో ఏమి జరుగుతుంది అన్నది ఇపుడు చర్చగా ఉంది. ఇవన్నీ పక్కన పెడితే పిన్నెల్లి ఈవీఎం ధ్వంసం చేసిన పోలింగ్ బూత్ టీడీపీకి పూర్తిగా అనుకూలమైనది కావడం ఇక్కడ కొసమెరుపుగా చెప్పుకోవచ్చు.

ఎన్నికల సంఘం పెట్టే కేసులు సాధారణంగానే తీవ్రంగా ఉంటాయి. వాటి నుంచి తప్పించుకోవడం దాదాపు అసాధ్యం. ఆయనపై ఇప్పటికే ఐపీసీ 143, 147, 427, 448, 452, 353, 120 బి, ఆర్పీ చట్టంతో పాటు 131, 135సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. ఇవన్నీ సీరియస్ సెక్షన్లే అని న్యాయ నిపుణులు కుండబద్దలు కొట్టి మరీ చెబుతున్నారు. ఒక విధంగా చెప్పాలీ అంటే ఆయన పూర్తిగా ఈ కేసులో ఇరుక్కుపోయారు అని ఇక్కడ తేటతెల్లం అయిపోతుంది. ఇక 2009లో కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా తొలిసారి గెలిచిన పిన్నెల్లి ఈసారి ఎన్నికల్లో ఖచ్చితంగా ఓడిపోతారు అనే అనుమానంతోనే అలా చేసివుంటాడని స్థానికులు చెవులు కొరుక్కుంటున్నారు. విషయం ఏదైనా పరిణామాలు తీవ్రంగానే ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరో వైపు చూస్తే పిన్నెల్లి కేసుని కేంద్ర ఎన్నికల సంఘం క్లోజ్ గా మానిటరింగ్ చేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: