గత ఐదేళ్లలో ఏపీ సీఎం వైఎస్ జగన్ ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేసి ఒక్కో మెట్టు పైకి ఎదిగి ప్రశంసలు అందుకున్నారు. అయితే జగన్ పథకాలు సక్రమంగా అమలు కావడానికి, ఆయన పథకాలు ప్రజల ప్రశంసలు అందుకోవడానికి ఎంతోమంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు కారణమని చెప్పవచ్చు. గతంలో అనంతపూర్ జిల్లా కలెక్టర్ గా పని చేసిన గంధం చంద్రుడు జగన్ కీర్తిప్రతిష్టలు మరింత పెరిగేలా వ్యవహరించారు.
 
గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఆయన పేరు మారుమ్రోగిందంటే గంధం చంద్రుడు ఎంత నీతి, నిజాయితీలతో పని చేశారో సులువుగానే అర్థమవుతుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఐఏఏస్ హోదాలో ఉండి కూడా చీపురు పట్టి రోడ్డు ఊడ్చి గంధం చంద్రుడు మొత్తం వ్యవస్థనే కదిలించారు. అధికారుల వద్దకు వెళ్లిన సమయంలో ఎవరైనా చెప్పులు వదలడం కానీ చేతులు కట్టుకోవడం కూడా చేయొద్దంటూ సెల్ఫ్ రెస్పెక్ట్ పోస్టర్లను ఆయన ప్రతి కార్యాలయంలో ఉంచేవారు.
 
కరోనా సమయంలో వైరస్ వ్యాప్తి జరగకుండా ఆయన తీసుకున్న చర్యలు అన్నీఇన్నీ కావు. స్వయంగా సీఎం జగన్ "చంద్రుడూ.. గుడ్ జాబ్" అని మెచ్చుకున్నారంటే ఆయన ప్రతిభ అర్థమవుతోంది. బాలికలను ఒక్కరోజు అధికారులుగా మార్చి వాళ్లలో గంధం చంద్రుడు ఆత్మస్థైర్యాన్ని నింపారు. వ్యవస్థలో లోపాలను గుర్తించి క్రమశిక్షణా చర్యలు తీసుకుని ఎన్నో మార్పులకు శ్రీకారం చుట్టారు. ప్రధాని మోదీ సైతం గంధం చంద్రుడిని మెచ్చుకున్నారు.
 
తర్వాత రోజుల్లో కొన్ని కారణాల వల్ల గంధం చంద్రుడిని గ్రామ, వార్డ్ సచివాలయాల డైరెక్టర్ గా బదిలీ చేయడం జరిగింది. గతేడాది ఆయన స్వచ్చ ఆంధ్ర కార్పొరేషన్ ఎండీగా బాధ్యతలు స్వీకరించారు. ఏ బాధ్యతలు చేపట్టినా ఆ బాధ్యతలకు పూర్తిస్థాయిలో న్యాయం చేసిన గంధం చంద్రుడు వైసీపీ పాలనలో అర్హత ఉన్న ప్రజలకు మంచి జరిగేలా తన వంతు కృషి చేయడం గమనార్హం. గంధం చంద్రుడు తన సుపరిపాలనతో జగన్ బలగంగా మారారనే చెప్పాలి.




మరింత సమాచారం తెలుసుకోండి: