- ప్ర‌భుత్వ ధ‌నం వృథా చేయ‌వ‌ద్ద‌ని చెప్పే విలువ‌లున్న ఆఫీస‌ర్‌
- ప్ర‌తిప‌క్షాల‌కు టైం కేటాయించి స‌మ‌స్య‌లు వింటార‌న్న మంచి పేరు

( గుంటూరు - ఇండియా హెరాల్డ్ )

డాక్ట‌ర్ వేణుగోపాల్ రెడ్డి. ఈయ‌న పేరు గుంటూరులో ప్ర‌త్యేకం. రాష్ట్రంలో ఎన్నిక‌ల‌కు ముందు చాలా మంది క‌లెక్ట‌ర్లు మారినా.. గుంటూరు జిల్లాలో మాత్రం క‌లెక్ట‌ర్‌ను మార్చాల‌ని కానీ.. ఆయ‌న వ‌ల్ల త‌మ‌కు ఇబ్బందులు ఉన్నాయ‌ని కానీ.. ఏ పార్టీ ఆరోపించ‌లేదు. పైగా.. ఎవ‌రికీ ఫిర్యాదు కూడా చేయ‌లేదు. కానీ, ఇత‌ర జిల్లాల్లో మాత్రం కొన్ని విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. ఇక్కడ విమ‌ర్శలు రాక‌పోవ‌డానికి ప్ర‌ధాన కార‌ణం.. క‌లెక్ట‌ర్‌గా వేణు గోపాల రెడ్డి వేసిన అడుగులే.


ఆయ‌న ఎక్క‌డా ఎవ‌రినీ ఎక్కువ‌గా ఎంట‌ర్ టైన్ చేయ‌రు. నియమ నిబంధ‌న‌ల‌కు పెద్ద పీట వేస్తార‌నే పేరు తెచ్చుకున్నారు. అదే స‌మ‌యంలో ఎవ‌రు వ‌చ్చి త‌న‌ను క‌లుసుకున్నా.. వారికి స‌మ‌యం ఇస్తారు. స‌మ‌యం లేదు.. రేపు చూద్దాం.. మాపు చూద్దాం.. అనే మాటే వినిపించ‌కుండా.. త‌న ప‌నిని స‌క్రమంగా చేసుకుపోయారు ప్ర‌తిప‌క్షాల‌కు, అధికార ప‌క్షానికి కూడా.. స‌రైన స‌మ‌యం కేటాయించిన క‌లెక్ట‌ర్ల‌లో వేణుగోపాల్‌రెడ్డి పేరు ప్ర‌ముఖంగా వినిపిస్తుంది.


ఒక‌టి రెండు సంద‌ర్భాల్లో అధికార ప‌క్షం నుంచే ఫిర్యాదులు వెళ్లాయి త‌ప్ప‌.. ప్ర‌తిప‌క్షం నుంచి అస‌లు ఫిర్యాదులు వెళ్ల‌లేదు. అంద‌రినీ స‌మానంగానే చూస్తున్నార‌నే పేరు తెచ్చుకున్నారు. అంతేకాదు.. స‌భ‌లు, స‌మావేశాల విష‌యంలోనూ అంద‌రినీ స‌మానంగానే చూశారు. దీంతో టీడీపీ గుంటూరులో నిర్వ‌హించిన అన్ని స‌మావేశాలు కూడా స‌క్సెస్ అయ్యాయి. ఇక‌, ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌కు పెద్ద పీట వేస్తూ.. నిజ‌మైన ల‌బ్దిదారుల ఎంపిక విష‌యంలో వేణుగోపాల రెడ్డి ఖ‌చ్చితంగా ఉండేవారు.


అంతేకాదు.. ప్ర‌భుత్వ ధ‌నాన్ని వృథా చేయొద్ద‌ని చెప్ప‌డంలోనూ.. ఆయ‌న ముందుండేవారు. కేవ‌లం ఒకే ఒక్క‌కారును వినియోగిస్తూ.. త‌న‌కు సేవ‌లు చేసేందుకు కూడా త‌క్కువ మంది సిబ్బందిని నియ‌మించు కుని.. ఖ‌ర్చును పొదుపు చేయ‌డం.. ఈయ‌న స్పెష‌ల్ . అయితే.. ఈయ‌న మీడియాకు పెద్ద‌గా అందుబాటు లో ఉండేవారు కాదు. అదేవిధంగా చేసింది కూడా .. చెప్పుకోనేవారు.కాదు. అంతా ప్ర‌భుత్వం చూసుకుంటుంద‌ని అనేవారు. ఇదే ఆయ‌న‌కు మంచి పేరు తెచ్చి పెట్టింద‌న‌డంలో సందేహం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: