•చదువుకునే పేద పిల్లలకు అండగా నిలుస్తున్న కలెక్టర్ సృజన

•విధులని సక్రమంగా నిర్వర్తిస్తూ ప్రభుత్వానికి మంచి పేరు తెస్తున్న సృజన


కర్నూల్ - ఇండియా హెరాల్డ్: కర్నూల్ జిల్లా కలెక్టర్ జి సృజన తాను చేస్తున్న మంచి పనులతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తన విధులను సక్రమంగా నిర్వర్తిస్తూ మంచి కలెక్టర్ గా జనాల్లో పేరు తెచ్చుకున్నారు. ఆమె తన విధులతో ఇంకా మంచి పనులతో జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వానికి చాలా మంచి పేరు తీసుకొస్తున్నారు. తన విధులను సక్రమంగా నిర్వర్తించడం వల్ల చాలా మంది పేద ప్రజలు ప్రయోజనాలు పొందుతున్నారు. నేను కలెక్టర్ ని నాకు తిరుగుండదు అని అహంకారం చూపించకుండా చాలా సింపుల్ గా ఉంటూ జిల్లాలో తన పనులని చక్కగా చేస్తూ పేద ప్రజలకు అండగా నిలుస్తూ  ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొస్తున్నారు. ముఖ్యంగా చదువుకునే పేద పిల్లలకు కలెక్టర్ సృజన అండగా నిలుస్తూ చాలా మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. తన అధికారంని దుర్వినియోగం చేయకుండా ఆ అధికారంని మంచి పనులకు ఉపయోగిస్తూ పేదలకు అండగా నిలుస్తూ మంచి కలెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. తన జిల్లాలో బాగా చదువుకుంటున్న స్టూడెంట్స్ ని బాగా ఎంకరేజ్ చేస్తూ వారిని పిలిచి మరి అభినందిస్తూ వారి పైచదువులకి సహాయం చేస్తూ కలెక్టర్ గా తన అధికారాన్ని మంచిగా వినియోగించుకుంటూ శభాష్ అనిపించుకుంటున్నారు సృజన.


ఇటీవల కర్నూలు జిల్లా ఆదోని మండలం పెద్ద హరివాణం గ్రామానికి చెందిన నిర్మల అనే అమ్మాయి 10వ తరతగతిలో మంచి మార్కులు సాధించినప్పటికీ పేదరికంతో తల్లిదండ్రులు చదువు మాన్పించిన సందర్భంలో కలెక్టర్‌ సృజన ప్రత్యేక శ్రద్ధ తీసుకొని నిర్మలను ఆస్పరి కేజేబీవీలో చేర్పించారు. ఆ విద్యార్థిని ఇంటర్మీడియట్‌ బైపీసీ గ్రూప్‌తో మొదటి సంవత్సరం పరీక్షల్లో 440 మార్కులకు ఏకంగా 421 మార్కులు సాధించి జిల్లాలో టాపర్‌గా నిలిచింది. ఈ సందర్భంగా కలెక్టర్‌ సృజన నిర్మలను క్యాంప్‌ కార్యాలయానికి పిలిపించుకొని అభినందించడం అనేది ఆమె గొప్ప మనసుకు నిదర్శనం.విద్యార్థిని నిర్మల ఖాతాలో ఇన్సెంటివ్‌ జమ చేయడం వల్ల ఇంటర్‌ తరువాత వారి తల్లిదండ్రులకు ఆర్థిక భారం లేకుండా పై చదువులు చదువుకోడానికి ఉపయోగపడటానికి సహాయం చేశారు.ఆర్ధిక సమస్యలతో చదువుకోలేక మధ్యలో చదువు ఆపేసిన వారు ఇంకా ఎవరైనా ఉంటే స్పెషల్‌ క్యాంపెయిన్‌ నిర్వహించి అలాంటి వారిని ఈ సంవత్సరం కేవీజీబీల్లో అడ్మిషన్‌ చేయించాలని ఆదేశించి బాధ్యత గల కలెక్టర్ గా పేరు తెచ్చుకోవడమే కాకుండా జగన్ ప్రభుత్వానికి కూడా మంచి పేరు తీసుకొస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: