ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ డైరెక్షన్లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ పుష్ప 2. బ్లాక్ బస్టర్ మూవీ పుష్ప సినిమాకు ఇది సీక్వెల్ గా రూపొందుతుంది. ఇక ఈ చిత్రాన్ని movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ ఎంతో గ్రాండ్గా నిర్మిస్తున్నారు. దర్శకుడు సుకుమార్ పుష్ప 2 సినిమాలు మరింత భారీగా ఎక్కడా కూడా కాంప్రమైజ్ కాకుండా రూపొందిస్తున్నారు. ఇక ఈ చిత్రం నుంచి మేకర్స్ ఇప్పటికే రిలీజ్ చేసిన గ్లిమ్స్ వీడియో, పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.

ఇక ఇదిలా ఉంటే ఈ సినిమా నుంచి ఇటీవల రిలీజ్ అయిన ఫస్ట్ సింగిల్ ప్రేక్షకులను ఫిదా చేసింది. పుష్ప పుష్ప అంటూ సాగే ఈ సాంగ్ రికార్డ్ వ్యూస్ తో అదరగొట్టింది. ఇక ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా నుంచి సెకండ్ సాంగ్ ప్రోమో మేకర్స్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. కపుల్ సాంగ్ రానున్న ఈ సాంగ్ మే 29 ఉదయం 11 గంటల ఏడు నిమిషాలకు రిలీజ్ చేయనున్నారు. అయితే ఈ చిత్రంలో అదిరిపోయే ఐటమ్ సాంగ్ ఉండనున్నట్లు సమాచారం నడుస్తుంది.

పుష్ప సినిమాలోని ఐటమ్ సాంగ్ ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికీ తెలిసిందే. ఊ అంటావా మామ అంటూ సమంత వేసిన స్టెప్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. అయితే పుష్ప 2 సినిమాలో కూడా అదిరిపోయే ఐటమ్ సాంగ్ మేకర్స్ ప్లాన్ చేశారట. అయితే ఆ ఐటమ్ సాంగ్ కోసం చాలామంది హీరోయిన్స్ ను సంప్రదించారు. ఇక తాజాగా యానిమల్ బ్యూటీ తృప్తి  పేరు వినిపిస్తుంది. యానిమల్ సినిమాతో స్టార్ స్టేటస్ అందుకున్న ఈ భామ పుష్ప 2 లో ఐటమ్ సాంగ్ చేయనున్నట్లు తెలుస్తుంది. ఒకవేళ ఇదే కనుక నిజమైతే తృప్తి   కెరీర్ పూర్తిగా మారిపోయినట్లే అని చెప్పుకోవచ్చు. ప్రజెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: