దేశ వ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల ఫలితాలు జూన్ 4 న తేలనున్నాయి.. ఫలితాల రోజు అందరూ జాగ్రత్తగా ఉండండి అంటూ ప్రశాంత్ కిషోర్ ఎక్స్ ఖాతా ద్వారా సంచలన వ్యాఖ్యలు చేశారు.తాజాగా ఆయన ప్రముఖ జర్నలిస్ట్ కరణ్ థాపర్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ వాడీవేడిగా సాగింది.అయితే ఆ ఇంటర్వ్యూ లో 47 ఏళ్ల వయసు గల్గిన రాజకీయ వ్యూహకర్త  ప్రశాంత్ కిషోర్ ఎన్నికల ఫలితాల అంచనాలు తారుమారు అయ్యాయని జర్నలిస్ట్ కరణ్ థాపర్ గుర్తు చేసారు..హిమాచల్ ప్రదేశ్ విషయం లో వెలువరించిన అంచనాలు దారుణంగా తప్పాయి కదా అని కరణ్ థాపర్ ప్రశ్నించగా... నేను హిమాచల్ ప్రదేశ్ విషయంలో అంచనాలు వెలువరించినట్టు వీడియో సాక్ష్యాలు ఏమైనా ఉన్నాయా అని పీకే ప్రశ్నించారు.2021 లో బెంగాల్ ఎన్నికల్లో కిషోర్ తృణమూల్ కాంగ్రెస్ కు వ్యూహకర్తగా పనిచేశాను. మమతా బెనర్జీ టీఎంసీ పార్టీ 294 స్థానాలకు గాను 215 స్థానాలను గెలుచుకుని అఖండ మెజారిటీ తో అధికారాన్ని నిలుపుకుందని ఈ సందర్భంగా ప్రశాంత్ గుర్తుచేశారు. 

అలాగే ఇప్పడు తాను చెప్పే ఫలితాలు కూడా నిజమవుతాయని ధీమా వ్యక్తం చేశారు.అందుకే ప్రతి ఒక్కరూ నీటిని అందుబాటులో ఉంచుకోండి అని రాజకీయ నాయకులకు ఆయన కౌంటర్ వేశారు.. జూన్ 4న ఎన్నికల ఫలితాలు విడుదల అవ్వగానే మీ మనసు, శరీరం రెండింటినీ కూడా కొద్దిగా హైడ్రేటెడ్‌గా ఉంచడంలో నీరు సహాయపడుతుందని ఆయన గుర్తు చేశారు. బుధవారం ఓ ఇంటర్వూలో ప్రశాంత్ కిషోర్ మాట్లాడుతూ బీజేపీకి సొంతంగా 370 సీట్లు రావడం కష్టమని తెలిపారు.బీజేపీ పార్టీకి పార్టీకి దాదాపు 300 సీట్లు వస్తాయని ప్రశాంత్ కిషోర్ జోస్యం చెప్పారు. అయితే ఎన్డీఏ అనుకుంటున్నట్లు 400 సీట్లు రావడం అసాధ్యమని ఆయన చెప్పారు.270 సీట్ల కు తగ్గకుండా బీజేపీ కీ సీట్లు వస్తాయని ప్రశాంత్ కిషోర్ తెలిపారు..

మరింత సమాచారం తెలుసుకోండి: