ఎన్నికల ఫలితాల పై రికార్డ్ స్థాయిలో బెట్టింగ్ జరుగుతుంది. కేవలం రాజకీయ పార్టీలే కాదు.. పార్టీల పెద్దలు.. అభ్యర్థులు కూడా పందెం కోళ్ళుగా మారిన పరిస్థితి నెలకొంది. హేమాహేమీలు బరిలో ఉన్న ఉమ్మడి చిత్తూరు జిల్లాలో గెలుపోటములపై పందేల జోరుపై నిఘా ఉందంటున్న పోలీసు యంత్రాంగం ఇప్పటి వరకు బెట్టింగ్ ముఠాల మూలాలను గుర్తించలేకపోయింది.ఆంధ్రాలో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో బెట్టింగ్ జెట్ స్పీడ్‎ను అందుకుంది. టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుతో పాటు మాజీ సీఎం కిరణ్, రాష్ట్ర మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆర్కే రోజా ఇలా ప్రముఖులు బరిలో ఉన్న చిత్తూరు జిల్లాలో పలు రకాల పందాలు బాగా జోరుగా కొనసాగుతున్నాయి. కుప్పంలో లక్ష ఓట్ల టిడిపి టార్గెట్ నుంచి గెలుపు ఓటములపై కూడా రాష్ట్ర వ్యాప్తంగా బెట్టింగులు బలంగా నడుస్తున్నాయి. మరోవైపు పుంగనూరులో మంత్రి పెద్దిరెడ్డి, నగరిలో మంత్రి ఆర్కే రోజాల గెలుపు ఓటములుపైనా మెజారిటీలు లెక్కలేసుకుంటున్న పందెం రాయుళ్లు పెద్ద ఎత్తున బెట్టింగులు చేస్తున్నారు.


పార్టీ అధికారంలోకి వస్తుంది.. చిత్తూరు జిల్లాలో ఏ పార్టీ పైచెయ్యి సాధిస్తుందన్న పందాలు రికార్డ్ స్థాయిలో నడుస్తున్నాయి.ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సంబంధించి కుప్పం, పుంగనూరు, చంద్రగిరి, తిరుపతి, చిత్తూరు, నగరి ఇంకా శ్రీకాళహస్తి అసెంబ్లీ సెగ్మెంట్ లనే ఎక్కువగా గెలుపోటములపై పందాలు భారీగా నడుస్తున్నాయి. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే పార్టీ ఏది, ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయన్న దానిపైనే కాకుండా కుప్పంలో చంద్రబాబు నాయుడు సాధించబోయే మెజారిటీ, ఆయన గెలుపు ఓటమిపైనా బెట్టింగులు బాగా నడుస్తున్నాయి. రాజంపేట పార్లమెంటు స్థానంపై కూడా జోరుగా పందెం రాయుళ్లు బెట్టింగ్‎లు చేస్తున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో తిరుపతి నుంచి మాత్రమే జనసేన బరిలోకి నిలిచింది. దీంతో గ్లాసు గుర్తు గెలుస్తుందా లేదా అన్న దానిపైన కూడా బెట్టింగ్‎లు కూడా పెద్ద ఎత్తున నడుస్తున్నాయి. ఇలా రికార్డ్ స్థాయిలో బెట్టింగ్ నడుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: