తెలంగాణ రాష్ట్ర పార్లమెంట్ ఎన్నికలు ఇటీవల ముగిసిన సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ తో పాటు తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ జరిగింది. అయితే ఈ ఎన్నికల ఫలితాలు వెలువడకముందు... ఒక పార్టీపై మరొక పార్టీ దుమ్మెత్తి పోసుకుంటున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ అలాగే బిజెపి పార్టీలు గులాబీ పార్టీని టార్గెట్ చేస్తున్నాయి. పార్లమెంట్ ఎన్నికల తర్వాత గులాబీ పార్టీ ఖాళీ కావడం గ్యారెంటీ అంటున్నాయి.

ఒకానొక సమయంలో బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు టిఆర్ఎస్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే కాంగ్రెస్లోకి గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు వెళ్తారని... ఆ సంఖ్య 25 వరకు ఉంటుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే తాజాగా ఇదే అంశంపై కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి స్పందించారు. కిషన్ రెడ్డి చెప్పిన వ్యాఖ్యలను స్వాగతిస్తూనే... భారతీయ జనతా పార్టీకి కౌంటర్ ఇచ్చారు జగ్గారెడ్డి.

గులాబీ పార్టీ నుంచే కాదు బిజెపి పార్టీ నుంచి ఐదు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి వస్తారని ఆయన బాంబు పేల్చారు. బిజెపిలోకి సీఎం రేవంత్ రెడ్డి వెళ్తారని... కేటీఆర్ అలాగే హరీష్ రావు బురద జల్లుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ అలాగే బిజెపి పార్టీలు బద్ధ శత్రువులని గుర్తు చేశారు జగ్గారెడ్డి. అలాగే ఐదేళ్లపాటు ముఖ్యమంత్రి పదవికి ఎలాంటి గండం లేదన్నారు. ప్రభుత్వాలను పూల్చడంలో బిజెపి నేతలు ప్రొఫెసర్లు అంటూనే... తెలంగాణ ప్రభుత్వానికి ఎలాంటి సమస్యలు లేవన్నారు.

దీంతో జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో దుమారాన్ని లేపుతున్నాయి. ఏది ఏమైనా తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల ఫలితాల తర్వాత పెను మార్పులు మాత్రం కచ్చితంగా ఉంటాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎక్కువ సీట్లు గెలవకపోతే... ఆ ప్రభుత్వానికి ప్రమాదం కూడా పొంచి ఉండే ఛాన్స్ ఉందని చెబుతున్నారు. ఇలాంటి పరిణామాలు జరగాలన్న పార్లమెంట్ ఎన్నికల ఫలితాల వరకు ఆగాల్సిందేనని వెల్లడిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

bjp