ఆంధ్రప్రదేశ్లోని ఎన్నికల ఓటింగ్ ప్రక్రియ మొదలు అయినప్పటి నుంచి.. ఎక్కువగా పలు రకాల రాజకీయాలు సైతం జరుగుతూ ఉన్నాయి.. ఇప్పటికి ఈవీఎంస్ ధ్వంసం చేయడం పలుచోట్ల గొడవలు అల్లర్లు వంటివి చోటు చేసుకుంటూనే ఉన్నాయి. దీంతో ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్లోని రాజకీయాలు చాలా హాట్ టాపిక్ గా మారుతున్నాయి.. దీంతో ఎన్నికల అధికారులు కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల పైన ప్రత్యేకమైన దృష్టి పెట్టి బలగాలను కూడా పెద్ద ఎత్తున దించడం జరిగింది.


అయినప్పటికీ కూడా చాలాచోట్ల హింసాత్మకమైన ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఎన్నికల ఓటింగ్ పూర్తి అయ్యి ఓటింగ్ కౌంటింగ్ కి మరో కొద్ది రోజులు ఉండంగానే హత్య రాజకీయాలతో మరొకసారి అలజడి ఆంధ్రప్రదేశ్లో సృష్టిస్తున్నాయి. తాజాగా అన్నమయ్య జిల్లాలోని జరిగిన ఒక ఘటన అందరిని కలచి వేస్తోంది. మదనపల్లి శ్రీవారి నగర్ లో వైఎస్ఆర్సిపి కార్యకర్త దారుణ హత్యకు గురయ్యారు.. మృతుడు పుంగనూరు శేషాద్రిగా పోలీసులు సైతం గుర్తించారు.. తెల్లవారుజామున శేషాద్రి ఇంట్లో చొరబడిన దుండగులు కత్తులతో మరి దాడి చేసి అతనిని నరికి చంపారట. ఆ తర్వాత అక్కడ నుంచి ఆ దుండగులు పరారైనట్లుగా సమాచారం.


అక్కడ ఉన్న ప్రజలు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో హుటా హుటిగా పోలీసులు బయలుదేరి ఆ సంఘటన స్థలానికి చేరుకున్నారు. హత్యకు గల కారణాలు ఏంటి అనే విషయం పైన ఆరా తీయగా వ్యక్తిగత గొడవల లేకపోతే రాజకీయ కక్షల అనే విషయం పైన పోలీసులు ఇంకా దర్యాప్తు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఎన్నికల ఓటింగ్ ప్రక్రియ జరగకముందే ఇలాంటి పరిణామాలు చోటు చేసుకోవడంతో అందరూ భయభ్రాంతులకు గురవుతున్నారు. మరి ఓటింగ్ కౌంటింగ్ ప్రక్రియ పూర్తి అయిన తర్వాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి మరి. ఇప్పటికే అధికారులు సైతం ఓటింగ్ ప్రక్రియ జరుగుతున్న సమయంలో చాలామంది నేతలను వారి యొక్క నియోజకవర్గాలలో అసలు ఉండకూడదని పలు రకాల ఉత్తర్వులను కూడా జారీ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: