- ఐటీకి శ్రీనాథ్ - రాజ‌శేఖ‌ర్ రెడ్డి - విద్యాసాగ‌ర్
- వ‌ర్సిటీల్లో ఐటీ విద్య పెంచ‌డంలో స‌క్సెస్‌
- విశాఖ , తిరుప‌తి పై టాప్ కాన్‌సంట్రేష‌న్‌

( విజ‌య‌వాడ - ఇండియా హెరాల్డ్ )

ఏపీ ప్ర‌భుత్వంలో నియ‌మితులైన స‌ల‌హాదారుల్లో కొన్ని కొన్ని శాఖ‌ల‌కు.. లెక్క‌కు మించి స‌ల‌హాదారుల ను నియ‌మించారు. ఆయా శాఖల ఇంపార్టెన్స్‌ను బ‌ట్టి.. ప్ర‌భుత్వం అలా నియామ‌కాలు చేసింద‌నే వాద‌న ఉంది. కీల‌క‌మైన ఇన్‌ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ(ఐటీ) రంగానికి సంబంధించి ముగ్గురు స‌ల‌హాదారుల‌ను నియ మించింది. వీరిలో శ్రీనాథ్‌ దేవిరెడ్డిని ఐటీ (టెక్నికల్‌) విభాగం స‌ల‌హాదారుగా నియ‌మించారు. ఈయ‌న‌కు కేబినెట్‌ ర్యాంకు కూడా ఇచ్చారు.

ఇక‌, ఇదే విభాగంలో విద్యాసాగర్‌రెడ్డిని కూడా ఐటీ (టెక్నికల్‌) స‌ల‌హాదారుగా నియ‌మించారు. అలాగే.. కె. రాజశేఖరరెడ్డి, ఐటీ (పాలసీ) విభాగానికి స‌ల‌హాదారుగా నియ‌మించారు. వీరంతా రాష్ట్రంలో ఐటీ విభాగాన్ని పుంజుకునేలా చేయ‌డంతోపాటు.. ఐటీలో పెట్టుబ‌డులు స‌మీక‌రించాల‌నే ల‌క్ష్యం నిర్ణ‌యించారు. అదేవిధంగా ఐటీ మంత్రిత్వ శాఖ‌కు అనుబంధంగా ప‌నిచేయాల‌ని తేల్చి చెప్పారు. అయితే.. గ‌డిచిన ఐదేళ్ల కాలంలో వీరు ఏం చేశార‌నేది మాత్రం సందేహంగానే ఉంది. అయితే.. ప్ర‌భుత్వ అంచ‌నాలు వేరేగా ఉన్నాయి.

ఐటీ అంటే.. కేవ‌లం పెట్టుబ‌డులు మాత్ర‌మే కాద‌ని.. విద్యారంగంలోనూ స‌మూల మార్పుల దిశ‌గా అడుగులు వేయ‌డం దీనికింద‌కే వ‌స్తుంద‌ని చెబుతోంది. ఇలా చూసుకుంటే.. ప‌లు మొబైల్ అప్లికేష‌న్ల‌ను అభివృద్ది చేయ‌డంలోనూ.. విద్యాల‌యాల్లో ఐటీ విద్యకు ప్రాధాన్యం పెంచ‌డంలోనూ వీరు స‌క్సెస్ అయ్యార‌నేది ప్ర‌భుత్వం చెబుతున్న వాద‌న‌గా ఉంది. ఈ విష‌యం లో వీరి కి మంచి మార్కులే ప‌డ్డాయ‌న్న టాకే ఎక్కువుగా వినిపించింది.

అయితే.. వీరిలో ఏ ఒక్కరూ కూడా.. మీడియా ముందుకు వ‌చ్చింది లేదు.. తాము ఏం చేసిందీ చెప్పుకొన్న దీలేదు. మొత్తానికి ఈ ముగ్గురు మాత్రం.. ఐటీ స‌ల‌హాదారులుగా నెల కు రూ. 3 ల‌క్ష‌ల రూపాయ‌ల వేతనం తీసుకున్నారు. ప్ర‌భుత్వ సౌక‌ర్యాల‌ను కూడా వాడుకున్నారు. విశాఖ‌, తిరుప‌తి ప్రాంతాల్లోనే వీరు ఎక్కువ‌గా మ‌కాం వేసి.. కార్య‌క‌లాపాలు నిర్వ‌హించ‌డం గ‌మ‌నార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: