ఆంధ్రప్రదేశ్లో ఈసారి సార్వత్రిక ఎన్నికలు సైతం చాలా భారీగానే పోలింగ్ జరిగింది. దీంతో భారీ ఎత్తున పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చిన ఓటర్లు తమకే అండగా నిలిచారని ఇరువురి పార్టీలు కూడా చెప్పుకుంటున్నారు. అయితే వాస్తవం మాత్రం ఏంటన్నది జూన్ 4వ తేదీన తెలుస్తుంది. అంతకుముందు ఎన్నికల ఫలితాలు ఎటువైపు ఉన్నాయో వాటిపైన కీలకమైన సంకేతాలు కూడా కనిపిస్తూ ఉంటాయి. రాష్ట్రంలో పోలింగ్ కేంద్రాలలో జరిగిన సాధారణ ఓటింగ్ తో పాటు ఉద్యోగులు వేసినటువంటి పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ కూడా కలిపి లెక్కించడం జరుగుతుంది.


అయితే ఇందులో కూడా ఈసారి భారీ ఎత్తున ఓటింగ్ నమోదయ్యాయి. గతంలో ఎన్నడూ లేనంతగా ఈసారి పోస్టల్ బ్యాలెట్ ద్వారా దాదాపుగా 5.4 లక్షల మంది ఓటింగ్ నమోదైనట్లుగా తెలుస్తోంది. ఈ ఓట్లన్నీ కూడా ప్రభుత్వాన్ని నడిపే ఉద్యోగులవే అని చెప్పవచ్చు. ఇవే ఎన్నికలుగా ఫలితాలను సైతం డిసైడ్ చేస్తూ ఉంటాయి. అయితే ఈ ఓటింగ్ ప్రక్రియ మొత్తం అధికార పార్టీ వ్యతిరేకంగానే జరిగిందని పలువురు నేతలు చెప్పుకుంటున్నారు. వివిధ జిల్లాలలో పోస్టల్ బ్యాలెట్లను లెక్కించడానికి ఆయా జిల్లాలలో ఎన్ని టేబుల్స్ వేయించాలనే అంశం పైన ఈసీ కీలక నిర్ణయం తీసుకుందట.ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలో 38,865 పోస్టల్ బ్యాలెట్లు నమోదు అయ్యాయి నంద్యాల జిల్లాలో 25,283 పోస్టల్ బ్యాలెట్లు వచ్చాయి మూడో స్థానంలో కడపలో 24,918; పోస్టల్ బ్యాలెట్ లో నమోదు అయ్యాయి. అత్యల్పంగా నరసాపురంలో 15,320 నమోదైనట్లుగా తెలుస్తోంది. పోస్టల్ బ్యాలెట్ వెనుక రిటర్నింగ్ అధికారి సీలు సంతకం లేని వాటిని కూడా పరిగణంలోకి తీసుకోవాలంటూ టిడిపి నేతలు ఈసీ ని కోరారు.. దీంతో రాష్ట్ర సీఈవో ముఖేష్ కుమార్ మీనా కూడా అంగీకరించింది అయితే టిడిపి రాతపూర్వక ఆదేశాలు కోరుతోంది. అంతేకాకుండా గెజిటెడ్ ఆఫీసర్ సంతకం లేకపోయినా సీలు లేకపోయినా కచ్చితంగా పరిగణలోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తుంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: