ఆంధ్రప్రదేశ్ లో గత నెల ఎన్నికల ప్రచారం హోరా హోరిగా సాగింది. అధికార, ప్రతిపక్షాలు ఒకరి మీద ఒకరు విమర్శ, ప్రతి విమర్శలు చేసుకోవడం ప్రజలకు హామీల వర్షం కురిపించడం, గడప, గడపకు తిరిగి ఓట్లు అడగడం ఇలా ఎంతో సందడిగా ప్రచారం జరిగింది. మే 13 న పోలింగ్ డే వచ్చేసింది.అయితే ఈ సారి ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్ ఓటర్లు జోరుగా పాల్గొన్నారు. యువత ఈ సారి భారీ ఎత్తున్న పోలింగ్ లో పాల్గొంది. అలాగే మహిళలు, దివ్యాంగులు, వృద్ధులు గంటల తరబడి క్యూ లైన్లలో నించుని ఓటు వేశారు.. అయితే ఈ సారి పోలింగ్ శాతం కూడా భారీగా పెరిగింది. కొన్ని సమస్యాత్మక నియోజకవర్గాలలో మినహా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా ఫలితాల కోసం నరాలు తెగే ఉత్కంఠటతో ఎదురుచూస్తుంది. ఈ సారి ఏ పార్టీకి కూడా భారీగా స్థానాలు వచ్చే పరిస్థితి కనపడటం లేదు. 

ప్రతి నియోజకవర్గంలో హారహోరి పోరు తప్పదు అన్నట్లు పరిస్థితి ఏర్పడింది.. దీనితో ఈ సారి మేము గెలుస్తాం అంటే మేము గెలుస్తాం అని ఇరు పార్టీ నాయకులు ఒకరి పై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు.అయితే ఈ సారి ఎన్నికలు పందెం రాయుళ్ళకి కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. తమ అభిమాన పార్టీనే గెలుస్తుంది అని బెట్టింగ్ రాయుళ్ళు జోరుగా పందెలు కాస్తున్నారు. ఇప్పుడు అంతా మెజారిటీపై బెట్టింగ్ జరుగుతుంది. జగన్ కు 60 నుంచి 68 వేల మెజారిటీ వస్తుందని, చంద్రబాబుకు 30 నుంచి 35 వేల మెజారిటీ వస్తుందని, అలాగే పవన్ కు 40 నుంచి 45 వేలు, లోకేష్ కు 30 నుంచి 32 వేలు, రఘురామకృష్ణకు 13 నుంచి 15 వేలు మెజారిటీ వస్తుందని బెట్టింగ్ రాయుళ్ళు లక్షల్లో పందేలు కాస్తున్నారు. అయితే ఈ బెట్టింగ్లో కూడా జగన్ టాప్ లో ఉండటం విశేషం. దీనితో ఈ సారి కూడా అధికారం జగనన్నదే అని బెట్టింగ్ రాయుళ్ళు కూడా భావించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: