వెస్ట్ బెంగాల్ ఎన్నికలు ఇప్పుడు చాలా హింసాత్మకంగా మారుతున్నాయి. గతంలో ఐదు విడతలలో జరిగిన పోలింగ్ సమయంలో కూడా ఇలాంటి దాడులు కొట్లాటలతో జరిగాయి. కానీ ఇప్పుడు ఏకంగా బిజెపి అభ్యర్థి పైన దాడి చేయడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. కొంతమంది ఆందోళన కారులు సైతం బిజెపి ఎంపీ అభ్యర్థిని తరిమికొడుతూ రాళ్లతో ఉన్నట్టుగా సోషల్ మీడియాలో ఒక వీడియో కలకలాన్ని రేపుతోంది.. మంగళపోట ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది.

దీంతో భద్రత బలగాలు ఆందోళన కారులను అడ్డుకునేందుకు ప్రయత్నం చేసినప్పటికీ అభ్యర్థిని కాపాడేందుకు సైతం బలగాలు చుట్టుముట్టి షీల్డ్ తో అడ్డు నిలబడ్డారు.. బిజెపి అభ్యర్థి ప్రణతి తుడుపైన ఈ దాడి జరిగినట్టుగా తెలుస్తోంది. ఒకసారిగా అక్కడ ఆందోళనకారులు రాళ్లు రూవడంతో ఎంపీ అభ్యర్థి పరుగులు పెట్టారు.. తృణమాల్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఈ పని చేసి ఉంటారని ఆ ఎంపీ అభ్యర్థి ఆరోపించారు. తన వ్యక్తిగత సెక్యూరిటీ సిబ్బంది పైన ఇలాంటి దాడులు జరగడంతో ప్రస్తుతం వీరంతా హాస్పిటల్ లో చేరినట్లుగా తెలుస్తోంది.


అయితే అటు ఆందోళన కారులు వాదన మరొక లాగా ఉందని ఓటు వేయడానికి వెళ్లిన సమయంలో లైన్ లో నిలబడ్డ ఒక మహిళను ప్రణత్ సెక్యూరిటీ చాలా వేధించారని అనుచితంగా ప్రవర్తించారని కూడా తెలియజేస్తున్నారు. అందుకే తాము దాడి చేశామని కూడా తెలియజేశారు. బిజెపి బెంగాలీలో కో ఇన్చార్జిగా అమిత్ మాల్వామా ఈ ఘటన పైన మాట్లాడుతూ తృణమాల కాంగ్రెస్ పైన ఆరోపణలు చేశారు.. ముఖ్యంగా త్వరలోనే బెంగాల్ ప్రజలు మమతా మెనర్జీని గద్దె దించుతారంటూ కూడా చేశారు. అయితే బిజెపి ఎంపీ తెలిపిన సమాచారం మేరకు అక్కడ ఆందోళన కారులు ఇటుకలు తన మీదికి విసరాలని పార్టీ ఏజెంట్లను పోలింగ్ బూత్లలోకి అడుగుపెట్టనివ్వడం లేదని స్వయంగా ఆయనే తెలియజేశారు. మూకుమ్మడిగా అందరూ దాడి చేశారని కూడా తెలిపారు. ప్రస్తుతం అందుకు సంబంధించి వీడియో మాత్రం వైరల్ గా మారుతున్నది.

మరింత సమాచారం తెలుసుకోండి: