ఎన్నికలు అనగానే ప్రతి ఒక్కరికి ముందుగా గుర్తుకు వచ్చేది ఓట్లు. ఎన్నికల నేపథ్యంలో ప్రజలందరూ ఓటు హక్కును వినియోగించుకుంటారు. ఐదు సంవత్సరాల భవిష్యత్తును ఈ ఒక్క ఓటు హక్కుతో నిర్ణయించుకుంటారు ఓటర్లు. అయితే ఈ ఓట్లతో పాటు... ఎన్నికల అనగానే సర్వేలు గుర్తుకు వస్తాయి. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైనప్పటి నుంచి రిజల్ట్స్ వచ్చేవరకు... చాలా సర్వే సంస్థలు తమ సర్వే రిపోర్టులను బయటపెట్టి... బ్రేకింగ్ ల మీద బ్రేకింగ్ లు వేస్తూ ఉంటాయి.
 

అయితే చిన్న చిన్న సంస్థలు కూడా సర్వేలు చేసి... సంచనాలు సృష్టిస్తున్నాయి. అందులో కొన్ని సార్లు సరైనవి ఫలితాలు వస్తే... మరి కొన్నిసార్లు అంచనాలకు తలకిందులుగా ఫలితాలు వస్తూ ఉంటాయి. సింపుల్గా చెప్పాలంటే ఎన్నికల సర్వేలు... ఎగ్జాక్ట్ గా ఎప్పుడు కాలేవని చెప్పగలం. ఎందుకంటే పోలింగ్ రోజున కూడా ఓటర్ నాడి మారిపోతూ ఉంటుంది. అయితే ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫలితాల గురించి చాలా సర్వేలు వచ్చాయి. అందులో ఒకటి న్యూస్ 18. ఇది నేషనల్ మీడియా సంస్థ. న్యూ 18 సర్వే సంస్థ గతంలో ఎన్నికల సర్వేను నిర్వహించింది.

 

అయితే 2024 అసెంబ్లీ అలాగే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో... ఏపీకి సంబంధించిన పార్లమెంట్ స్థానాలను న్యూస్ 18 అంచనా వేసింది. ఒపీనియన్ పోల్ పేరుతో ఓ సర్వే నిర్వహించింది న్యూస్ 18. ఈ లెక్కల ప్రకారం తెలుగుదేశం కూటమికి 25 సీట్లల్లో 18 ఎంపీ సీట్లు కైవసం చేసుకుంటుందని సర్వే వెల్లడించింది. ఇక అటు వైసీపీకి 7 ఎంపీ స్థానాలు మాత్రమే వస్తాయని ఈ సర్వే సంస్థ స్పష్టం చేసింది.

 

ఇటు షర్మిల చేరిన కాంగ్రెస్ పార్టీకి మాత్రం ఒక్క సీటు కూడా రాదని వెల్లడించింది న్యూస్ 18. ఇక ఈసారి సీఎం జగన్మోహన్ రెడ్డికి దళిత ఓట్లు దూరం కానున్నట్లు ఈ న్యూస్ 18 వెల్లడించింది. ఇక గతంలోను న్యూస్ 18 పేర్కొన్న ఫలితాలు దాదాపుగా దగ్గరగా వచ్చినట్లు చెబుతున్నారు విశ్లేషకులు. ఇటు 2024 సంబంధించి ఎంపీ స్థానాలను న్యూస్ 18 ప్రొజెక్ట్ చేయగలిగింది. ఈ లెక్కన చూసుకుంటే అసెంబ్లీ స్థానాలను కూడా మనం అంచనాల వేయవచ్చు.

పార్లమెంట్ స్థానాల లెక్కను బట్టి చూస్తే 100కు పైగా కూటమికి ఎమ్మెల్యే స్థానాలు వచ్చే ఛాన్స్ ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇటు వైసిపికి 60 నుంచి 70 వచ్చే ఛాన్స్ కూడా ఉన్నట్లు స్పష్టం అవుతుంది. అంటే ఏపీలో 2014 ఫలితాలు మరోసారి రిపీట్ కాబోతున్నాయన్నమాట. మరి ఈ న్యూస్ 18 సర్వే ఫలితాలు ఏ మేరకు సక్సెస్ అవుతాయో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: