తెలుగుదేశం పార్టీ బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు ప్రతి విషయం గురించి చాలా కచ్చితమైన లెక్కలను చెప్పింది. టీడీపీ ఆ సమయంలో ప్రతిపక్షంలో ఉంది, బీజేపీ మాత్రం కేంద్రంలో అధికారంలో ఉంది. ఏపీలో కూడా పొత్తుతో అయినా అధికారం సాధించాలని బీజేపీ అనుకుంది. అయితే అందుకు తమతో చేతులు కలపాలని టీడీపీ బీజేపీని బతిమిలాడింది. దాంతో ఆ పార్టీ ఆలోచన చేసింది. అంతేకాదు బీజేపీ నుంచి ఇద్దరు పరిశీలకులు ఏపీలో తిరిగి అసలు టీడీపీ గెలిచే అవకాశం ఉందా అనేది తెలుసుకున్నారు. వారి పరిశీలనలో టీడీపీకి 108 నుంచి 130 వరకు స్థానాలు వచ్చే అవకాశం ఉందని తెలిసింది. ఇక తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీలు పొత్తుగా పోటీ చేస్తే 130 దాకా సీట్లు రావచ్చు అని తెలుసుకున్నారు. ఇదే రిపోర్టును బీజేపీ అధిష్టానానికి చేర్చారు.

మరోవైపు తెలుగుదేశం పార్టీ కూడా సొంతంగా ఒక సర్వే చేసింది. తమ సర్వేలో తమ పార్టీ ఒక్కదానికే 105 నుంచి 120 వరకు అసెంబ్లీ స్థానాలు వచ్చే అవకాశం ఉందని తెలియజేసింది. ఇంకా మిత్రపక్ష పార్టీల కారణంగా మరో 15 సీట్లు గెలుచుకోవచ్చని తెలిపింది. దీనితో 135 దాకా సీట్స్‌తో భారీ విజయం సాధించవచ్చు అని ధీమా వ్యక్తం చేసింది. పార్లమెంటు స్థానాల విషయానికి వస్తే తాము 15 నుంచి 19 వరకు గెలుచుకోగలమని లెక్క ఇచ్చింది. మొత్తం మీద టీడీపీ లెక్కను పక్కాగా తయారుచేసి బిజెపి చేతుల్లో ఉంచింది. చంద్రబాబు ఒక మంచి మైండ్ గేమ్ ఆడి భారతీయ జనతా పార్టీ తమ పార్టీతో కలిసేలాగా చేశారు.

మరోవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా తమదే విజయవని పదేపదే చెప్పడంతో బీజేపీ మరో ఆలోచన లేకుండా టిడిపి వారితో చేతులు కలిపింది. ఒకవేళ ఓడిపోతే మాత్రం బీజేపీ వారు బాగా నిరాశ పడతారని చెప్పుకోవచ్చు. ఇక్కడ పార్టీ నేతలు బాగానే పోటీ చేస్తున్నారు. జూన్ 4వ తేదీన ఎవరి లెక్కలు నిజమవుతాయని తేలుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: