పల్నాడు జిల్లా మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి.. ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డి చిక్కుల్లో పడ్డారు. ఇప్పటికే పాల్వాయిగేటు పోలింగ్ కేంద్రంలో ఈవీఎం ధ్వంసం ఘటన మరియు సిఐ పై దాడి చేశారని అంశాలపై రెండు కేసులు నమోదయి ఉన్నాయి. ఇక తాజాగా మరో కేసులో కూడా ఇరుక్కున్నారు. పిన్నెల్లి బ్రదర్స్ నుంచి తన ప్రాణాలకు ముప్పు ఉందని టిడిపి కార్యకర్త.. కండ్లకుంట  పోలింగ్ కేంద్రంలో టిడిపి ఏజెంట్గా వ్యవహరించిన నోముల మాణిక్యరావు మంగళగిరి పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. తనను చంపడానికి నలుగురిని నియమించారని ఆరోపించారు. తాను మాచర్ల వెళ్లే పరిస్థితి లేదని.. తనకు రక్షణ కలిగించాలని పోలీసులను కోరారు మాణిక్యరావు. ముందు మంగళగిరి పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వెళ్ళగా అక్కడ తమ కంప్లైంట్ ను ఎవరు తీసుకోలేదని ఆయన వాపోయారు.

దీంతో మాణిక్యరావు టిడిపి నేతలతో కలిసి డిసిపి ని కలిసి వినతిపత్రం అందజేశారు. డిజిపి హరీష్ కుమార్ గుప్తా సానుకూలంగా స్పందించిన డీజీపీ భాధ్యులపై  తగిన చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారని నేతలు తెలియజేశారు. ఇక అనంతరం మంగళూరి పోలీసులు వీరి ఫిర్యాదు పై ఎట్టకేలకు స్పందించారు. ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరుడు వెంకటరామిరెడ్డి పై జీరో ఎఫైర్ నమోదు చేసేందుకు అంగీకరించారు మంగళూరి పోలీస్ సిబ్బంది. ఆదివారం రాత్రి 10 గంటల సమయంలో బాధితుడు మాణిక్యరావు తన లాయర్ తో కలిసి ఫిర్యాదు అందజేశారు. ఇక మరోవైపు ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మరోసారి ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించారు. తనపై నమోదు చేసిన మరో మూడు కేసులలో ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై హైకోర్టు ఆదివారం అత్యవసర విచారణ జరిపింది. ఇక ఈ పిటిషన్లపై వాదనల కొనసాగింపుకు విచారణను సోమవారానికి వాయిదా వేశారు.

అదేవిధంగా సిఐ నారాయణస్వామి పై పిన్నెల్లి మరియు ఆయన మనుషులు దాడి చేసి గాయపరిచిన కేసు అంశం కూడా ప్రస్తావనకు వచ్చింది. ఆ కేసు వివరణను పరిశీలించాలని పిపిసి కోర్ట్ సూచన చేయడం జరిగింది. పిన్నెల్లి పై రెంటచింతల మండలం పాల్వాయి గేటు పోలింగ్ స్టేషన్ లో టిడిపి ఏజెంట్ నంబూరి శేషగిరి రావు పై దాడి చేసి హత్యాయత్నం చేశారని రెంటచింతల పోలీసులు హత్యాయత్నం కింద కేసు నమోదు చేయడం జరిగింది. అదేవిధంగా పోలింగ్ మరుసటి రోజు ఎమ్మెల్యే పిన్నెల్లి మరియు ఆయన తమ్ముడు వెంకట్రామిరెడ్డి అనుచరులతో కలిసి కారంపూడి వెళ్లిన సమయంలో మళ్లీ ఘర్షణ జరగనున్నట్లు కనిపించింది. అయితే ఈ గొడవలని అడ్డుకోబోయిన సిఐటిపి నారాయణస్వామి పై దాడి చేసి గాయపరిచారని పోలీసులకు ఫిర్యాదు  చేశారు.

ఈ ఘటనలో పిన్నెల్లి మరియు ఆయన సోదరుడు అనుచరులపై 307 తదితర సెక్షన్ల కింద కారంపూడి పిఎస్ లో మరో కేసును నమోదు చేశారు. ఇక మరోవైపు పాల్వాయి గేటు పోలింగ్ బూత్ లో ఈవీఎంను ద్వంసం చేసి బయటకు వచ్చిన అనంతరం ఎమ్మెల్యే పిన్నెల్లి నీ మరో మహిళ ప్రశ్నించగా.. ఎమ్మెల్యే తీవ్రంగా దుర్భాషలాడినట్లు ఆ మహిళ ఫిర్యాదులో రెంటచింతల పోలీసులు మరో కేసు నమోదు చేశారు. ఇక ఈ కేసుల్లో బెయిల్ కోసం పిన్నెల్లి హైకోర్టును ఆశ్రయించారు. వాదన సందర్భంగా పిన్నెల్లి హై కోర్ట్ విధించిన షరతులను ఉల్లంఘించారని పిపి కోర్టుకు తెలిపారు. ఆయన కదలికలపై పోలీసులు నిగా ఉంచలేకపోయారన్నారు. మధ్యంతర ‌ బెయిల్ మంజూర్ చేయొద్దని కోరారు. కౌంటర్ వేసేందుకు సమయం కావాలని కోరారు.  ఓట్ల లెక్కింపు రోజున అల్లర్లు సృష్టించేందుకు అవకాశం ఉంది అని కూడా తెలిపారు. సిఐ తరపున కూడా లాయర్ వాదించారు. ఇక ఈ పిటిషన్లపై వాదనల కొనసాగింపుకు విచారణ సోమవారానికి వాయిదా పడింది.

మరింత సమాచారం తెలుసుకోండి: